డిల్లీలో రైతుల ఆందోళన...144 సెక్షన్ అమలు

By Arun Kumar PFirst Published Oct 2, 2018, 5:04 PM IST
Highlights

తమ డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్ 23 నుండి హరిద్వార్ నుండి ప్రారంభమైన రైతుల పాదయాత్ర మంగళవారం దేశ రాజధాని డిల్లీకి చేరింది. భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో కిసాన్ క్రాంతి యాత్ర పేరుతో తలపెట్టిన ఈ మహా పాదయాత్రలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. దీంతో ఆందోళనలు జరిగే అవకాశం ఉందంటూ ఉత్తర ప్రదేశ్- డిల్లీ సరిహద్దుల్లో ఈ యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. 
 
భారీకేడ్లను అడ్డపెట్టి రైతులను ఆపే ప్రయత్నం చేశారు. దీంతో రైతులు వాటిని తోసుకుంటూ ముందకు వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు రైతులపై టియర్ గ్యాస్, వాటర్ ప్రయోగించారు. దీంతో తూర్పు, ఈశాన్య డిల్లీల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఆందోళనల నేపథ్యంలో పోలీసులు ఈ ప్రాంతాల్లో  144 సెక్షన్ విధించారు. భారీ భద్రతా దళాలను మొహరించి ఈ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. 

మొత్తం ఐదు డిమాండ్లతో రైతులు ఈ యాత్ర చేపట్టారు. అయితే రైతు సంఘం నేతలతో చర్చలు జరిపిన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రైతుల 5 డిమాండ్లను నేరవేర్చడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. కానీ రుణమాఫీకి కేంద్రం ఒప్పుకోలేదు. దీంతో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. 
 
click me!