ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో సంచలనం.. ఈడీ రెండో చార్జ్‌షీట్‌లో కేజ్రీవాల్, ఎంపీ మాగుంట, ఎమ్మెల్సీ కవిత పేర్లు

Published : Feb 02, 2023, 04:25 PM ISTUpdated : Feb 02, 2023, 04:38 PM IST
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో సంచలనం.. ఈడీ రెండో చార్జ్‌షీట్‌లో కేజ్రీవాల్, ఎంపీ మాగుంట, ఎమ్మెల్సీ కవిత పేర్లు

సారాంశం

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌ దాఖలు  చేసిన రెండో చార్జ్‌షీట్‌లో పలు కీలక విషయాలను ప్రస్తావించింది. ఈ చార్జ్‌షీట్‌లో ఈడీ 17 మందిపై అభియోగాలు మోపింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌ దాఖలు  చేసిన రెండో చార్జ్‌షీట్‌లో పలు కీలక విషయాలను ప్రస్తావించింది. ఈ చార్జ్‌షీట్‌లో ఈడీ 17 మందిపై అభియోగాలు మోపింది. ఇక, ఈ ఛార్జ్‌షీటులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తెలంగాణ సీఎం కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్లను ఈడీ ప్రస్తావించింది. ఈ కేసులో అభిమోగాలు ఎదుర్కొంటున్న సమీర్‌ మహేంద్రు స్టేట్‌మెంట్‌లో కేజ్రీవాల్‌ పేరు వెల్లడైంది. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి విచారించిన జాబితాలో కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. అలాగే సాక్ష్యాలను ధ్వంసం చేసిన వారి జాబితాలో కూడా కవిత పేరును ఈడీ చేర్చింది. ఇక, ఢిల్లీ మద్యం కుంభకోణం నుంచి వచ్చిన డబ్బును ఆమ్ ఆద్మీ పార్టీ గోవాలో ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిందని ఈడీ పేర్కొంది. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?