యువకుడిని కిరాతకంగా కొట్టి చంపి.. మృతదేహాన్ని భుజాలపై మోసుకొచ్చి.. నేనే చంపానంటూ పోలీస్ స్టేషన్ ముందు వీరంగం..

Published : Jan 18, 2022, 06:32 AM IST
యువకుడిని కిరాతకంగా కొట్టి చంపి.. మృతదేహాన్ని భుజాలపై మోసుకొచ్చి.. నేనే చంపానంటూ పోలీస్ స్టేషన్ ముందు వీరంగం..

సారాంశం

ఓ వైపు పోలీసులు గాలిస్తుండగానే.. అర్ధరాత్రి నుంచి షాన్ బాబును జోమోన్ చిత్రహింసలకు గురిచేస్తూ కొట్టాయంలోని పలు ప్రాంతాలకు ఆటోలో తిప్పాడు. చివరికి అతను మరణించాడని భావించి పోలీస్ స్టేషన్ ముందు పడేసి లొంగిపోయాడు. జోమోన్ ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

తిరువనంతపురం :  State of Kerala కొట్టాయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడిని కిరాతకంగా కొట్టి చంపిన Rowdysheeter ఆ తర్వాత deadbodyని భుజాలపై మోసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు పడేశాడు. తానే చంపినట్టు పెద్ద పెద్దగా అరిచి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 

జోమోన్ కె జోస్ అనే ఓ రౌడీ షీటర్.. Cannabis, Drugs  దందా నిర్వహిస్తూ ఉంటాడు. పాత కక్షల కారణంగా షాన్ బాబు (19) అనే యువకుడిని అత్యంత దారుణంగా కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి షాన్ బాబును ఇంట్లో నుంచి జోమోన్ తీసుకెళ్లాడు.  ఎంతసేపటికీ తన కుమారుడు ఇంటికి రాకపోవడంతో యువకుడి తల్లి అర్ధరాత్రి కొట్టాయం ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి పోలీసులు కూడా అతని కోసం గాలిస్తున్నారు.

ఓవైపు పోలీసులు గాలిస్తుండగానే.. అర్ధరాత్రి నుంచి 
షాన్ బాబును జోమోన్ చిత్రహింసలకు గురిచేస్తూ కొట్టాయంలోని పలు ప్రాంతాలకు ఆటోలో తిప్పాడు. చివరికి అతను మరణించాడని భావించి పోలీస్ స్టేషన్ ముందు పడేసి లొంగిపోయాడు. జోమోన్ ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని ఠాణాకు తీసుకు వచ్చినప్పుడు అతడు మద్యం, గంజాయి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 

ఇదిలా ఉండగా, sankranthi festival ఆ కుటుంబంలో విషాదం నింపింది. వ్యవసాయానికి మూలమైన పశువులకు పండుగ చేసుకుని సంబురాలు చేసుకుందామనుకున్న గ్రామంలో కలకలం రేగింది. తరతరాలుగా సంప్రదాయంగా వస్తున్న cattle festivalను వేడుకగా జరుపుకుందామనుకుంటే అంతులేని విషాదం ఆ కుటుంబాన్ని ఆవరించింది. 

ఈ విషాదకర ఘటన Chittoorలో జరిగింది. పశువుల పండుగలో విషాదం చోటు చేసుకుంది. ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగించే క్రమంలో పొట్టేలును Sacrifice చేస్తుండగా.. దాన్ని పట్టుకున్న వ్యక్తి మృతి చెందాడు. బలి ఇచ్చే వ్యక్తి.. liquor మత్తులో పొట్టేలుకు బదులు వ్యక్తి ప్రాణాన్ని తీశాడు. భయాందోళనలు కలిగించేలా ఉన్న ఈ ఘటనలో అక్కడ ఒక్కసారిగా కలకలం చెలరేగింది. 

ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలంలోని వలసపల్లెలో జరిగింది. తరతరాలుగా సంప్రదాయబద్ధంగా వస్తున్న పండుగ ఆచారం ప్రకారం స్థానిక ఎల్లమ్మ ఆలయం వద్ద పొట్టేలును బలివ్వడానికి గ్రామస్తులు సిద్ధమయ్యారు. అయితే పొట్టేలును నరికే వ్యక్తి కాస్త ఎక్కువగానే తాగి ఉన్నాడు. అది వీరు గమనించుకోలేదో.. లేక కామనే అనుకున్నారో కానీ ఓ వ్యక్తి ప్రాణం గాల్లో కలిసిపోయింది. 

బలి ఇచ్చే క్రమంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి పొట్టేలును నరకబోయి.. పొట్టేలును పట్టుకున్న సురేష్ (35) అనే వ్యక్తిని నరికాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది చూసి గ్రామస్తులు, కుటుంబసభ్యులు ఒక్కక్షణం షాక్ అయ్యారు. ఆ తరువాత ఏడుపులు మిన్నంటాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !