సినిమా స్టైల్ క్రైమ్ స్టోరీ.. నర్సు వేషంలో వచ్చి ఆస్పత్రిలో ఫ్రెండ్‌ భార్యను..

Published : Aug 06, 2023, 01:44 PM IST
సినిమా స్టైల్ క్రైమ్ స్టోరీ.. నర్సు వేషంలో వచ్చి ఆస్పత్రిలో ఫ్రెండ్‌ భార్యను..

సారాంశం

Pathanamthitta: ఒక ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో న‌ర్సుగా ప‌నిచేస్తున్నట్టు న‌టిస్తూ.. స్నేహితుడి భార్యను హత్య చేసేందుకు ప్రయత్నించింది ఓ 30 ఏళ్ల మహిళ. అయితే, ఆమె రెండుసార్లు ఖాళీ సిరంజిని ఉపయోగించి బాధితురాలికి శ‌రీరంలోకి గాలిని ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నించింది. అనుమానం క‌లిగిన కుటుంబ స‌భ్యుల అప్ర‌మ‌త్త‌త‌తో పోలీసులు రంగంలోకి దిగి హ‌త్య‌ కుట్ర‌ తెరలేపిన మ‌హిళ‌ను అరెస్టు చేశారు.  

Kerala WomanTries To Kill Friend's Wife: తాజాగా ఒక షాకింగ్ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న స్నేహితుడి భార్య‌ను హ‌త్య చేయ‌డానికి కుట్ర ప‌న్నింది ఒక మ‌హిళ‌. దీని కోసం అక్క‌డ ప‌నిచేస్తున్న న‌ర్సుగా వేశం వేసుకుని ఆస్ప‌త్రిలోకి ఎంట‌రైంది. అయితే, ఆమె రెండుసార్లు ఖాళీ సిరంజిని ఉపయోగించి బాధితురాలికి శ‌రీరంలోకి గాలిని ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నించింది. అనుమానం క‌లిగిన కుటుంబ స‌భ్యుల అప్ర‌మ‌త్త‌త‌తో పోలీసులు రంగంలోకి దిగి హ‌త్య‌ కుట్ర‌కు ప‌న్నిన మ‌హిళ‌ను అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న కేర‌ళ‌లో చోటుచేసుకుంది.

ఈ హ‌త్య కుట్ర గురించి పోలీసులు, బాధితులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. కేర‌ళ‌లోని ప‌త‌నంతిట్ట‌లో ఉంటున్న స్నేహ అనే వివాహిత‌పై హ‌త్య కుట్ర జ‌రిగింది. ఈ దారుణ కుట్ర‌కు తెర‌లేపింది బాధితురాలి భ‌ర్త స్నేహితురాలైన మ‌హిళ అనుష‌. స్నేహ భ‌ర్త, అనుష స్నేహితులు, క్లాస్ మేట్స్ కూడాను. ఆయ‌న విదేశాల్లో ప‌నిచేస్తున్నాడు. స్నేహ గ‌ర్భ‌వ‌తిగా ఉండ‌టంతో డెలివ‌రీ కోసం స‌మీపంలోని ఒక ప్ర‌యివేటు ఆస్ప‌త్రికి వెళ్లింది. ఈ విష‌యం తెలుసుకున్న అనుష‌..  నర్సుగా నటిస్తూ ఆస్ప‌త్రిలోకి ప్ర‌వేశించింది. ఆ త‌ర్వాత త‌న కుట్ర‌ను అమ‌లు చేస్తూ.. తన స్నేహితుడి భార్యను హత్య చేయడానికి ప్రయత్నించింది.

ఆస్ప‌త్రిలోకి నర్సుగా మారువేషంలో స్నేహ గదిలోకి ప్రవేశించిన నిందితురాలు అనుష‌.. బాధితురాలికి మరో ఇంజక్షన్‌ వేయాలని చెప్పింది. ఈ క్రమంలోనే వేరే గ‌దిలోకి తీసుకెళ్లింది. ఇక ఇంజ‌క్ష‌న్ ఇచ్చే స‌మ‌యంలో తటపటాయించింది. రెండు సార్లు గాలితో కూడిన ఇంజ‌క్ష‌న్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించి విఫ‌లమైంది. అయితే, అనుమానం క‌లిగి కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. అనుష‌ను అదుపులోకి తీసుకుని విచార‌ణ చేయ‌గా, దీంతో అనూష బండారం బయటపడింది. అయితే, త‌న స్నేహితుని భార్య‌ను ఎందుకు హ‌త్య చేయాల‌నుకుంద‌నే వివ‌రాలు తెలియ‌లేదు. దీనిపై విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని పోలీసులు తెలిపారు.

"ఆమె రెండుసార్లు ఖాళీ సిరంజిని ఉపయోగించి బాధితుడి సిరలోకి గాలిని ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నించింది, కానీ విఫలమైంది. ఆమె మళ్లీ ప్రయత్నించినప్పుడు, స్నేహ తల్లి అనుమానం వచ్చి నర్సింగ్ సిబ్బందికి సమాచారం ఇచ్చింది" అని పోలీసులు తెలిపారు. అయితే, ఆ న‌ర్సుపై అనుమానం క‌లిగిన ఆస్ప‌త్రి సిబ్బంది పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కాగా, బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?