పెళ్లి చేసుకున్న తొలి ట్రాన్స్ జెండర్ వుమెన్ జర్నలిస్ట్

By telugu teamFirst Published Jan 27, 2020, 8:01 AM IST
Highlights

దేశంలోని తొలి వుమెన్ ట్రాన్స్ జెండర్ జర్నలిస్టు వివాహం చేసుకుంది. కేరళలోని ఎర్నాకులంలో ట్రాన్స్ జెండర్ పుమెన్ అధర్వ్ మోహన్  అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. కేరళలో ఇది నాలుగో ట్నాన్స్ జెండర్ వివాహం.

ఎర్నాకులం: దేశంలోని మొట్ట మొదటి ట్రాన్స్‌వుమెన్‌ జర్నలిస్ట్‌ హైదీ సాదియా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టంది. కేరళలోని ఎర్నాకులంలో ఆదివారం  గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆమె ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో అత్తర్వ్‌ మోహన్‌ను వివాహం చేసుకుంది. కేరళ రాష్ట్రం రూపొందిన ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకున్న నాలుగో ట్రాన్స్‌జెండర్‌ హైదీ సాదియా. 

కాగా, సాదియా వివాహంపై ఇరు కుటుంబాల పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. వారిద్దరి మనసులు కలిశాయని, అందుకే వారి మనసులు నొప్పించకుండా వివాహానికి అంగీకంరించామని, సంప్రదాయ పద్దతిలో పెళ్లి చేశామని వారు తెలిపారు..

ఈ వివాహ కార్యక్రమాన్ని శ్రీ సత్యసాయి అనాథ శరణాలయం ట్రస్ట్, ఎర్నాకులం ఎన్ఎస్ఎస్ కరయోగం సంయుక్తంగా నిర్వహించాయి. అధర్వ్ మోహన్ తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. కేరళలోని హరిపాద్ కు చెందిన వాడు.

హైదీ నదియా ట్రాన్స్ జెండర్ మేకప్ ఆర్టిస్ట్ రేంజు రంజీమార్ పెంపుడు కూతురు కాగా, అధర్వ్ మోహన్ ట్రాన్స్ జెండర్ దంపతులు ఇషాన్ షాన్, సూర్యల కుమారుడు.

click me!