నిర్భయ దోషులు: 24 గంటల పాటు నిఘా, ఆత్మహత్య చేసుకోకుండా జాగ్రత్తలు

By narsimha lodeFirst Published Jan 26, 2020, 4:50 PM IST
Highlights

నిర్భయ దోషులను తీహార్ జైలులోని మూడో నెంబర్ గదికి తరలించారు.6X8 అడుగులున్న గదుల్లో ఒక్కొక్క దోషులను ఉంచారు. 

న్యూఢిల్లీ: నిర్భయ దోషులను తీహార్ జైలులోని మూడో నెంబర్ గదికి తరలించారు. జైలులో ఉన్న దోషులు ఆత్మహత్య చేసుకోకుండా నిరంతరం కాపలా ఏర్పాటు చేశారు.

6X8 అడుగులున్న గదుల్లో ఒక్కొక్క దోషులను ఉంచారు. జైలు గది వద్ద ఇద్దరు గార్డులు 24 గంటల పాటు కాపలా కాస్తారు గదుల్లో అటాచ్డ్ టాయిలెట్స్ ఉంటాయి. అక్కడ కూడ సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు.

Also read:నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న ఉరి

దోషులు ఉండే గదుల్లో ప్రతి రోజూ రెండు దఫాలు గార్డులు తనిఖీలు చేస్తారు. ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఉంటాయి. జైలు సూపరింటెండ్ కార్యాలయం నుండి దోషులు ఉన్న గదుల్లో నిరంతర పర్యవేక్షణ ఉంటుంది.

నిర్భయ కేసులో దోషిగా ఉన్న రామ్ సింగ్ ఇదే జైలులోని రూమ్ నెంబర్ 3లో 2013 మార్చి 11వ తేదీన ఆత్మహత్య చేసుకొన్నాడు. దీంతో నిర్భయ కేసులో  దోషులు ఆత్మహత్య చేసుకోకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.

మరో వైపు దోషులు తమను తాము గాయపర్చుకోకుండా సెక్యూరిటీ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకొన్నారు. ప్రతిరోజూ దోషులను వైద్యులు నిరంతరం వైద్యులు పరిక్షించేవారు.

పవన్ తప్ప మిగిలిన దోషులు చెందినట్టు కనపడలేదు. జైలు అధికారులు తెలిపారు. దోషులకు పిబ్రవరి 1వ తేదీ ఆరు గంటలకు ఉరి తీయనున్నారు.

click me!