ప్రొఫెసర్ టీజే జోసెఫ్ చేతి నరికివేత కేసు.. ఆరుగురిని దోషులుగా నిర్దారించిన ఎన్‌ఐఏ కోర్టు..

Published : Jul 12, 2023, 12:25 PM IST
ప్రొఫెసర్ టీజే జోసెఫ్ చేతి నరికివేత కేసు.. ఆరుగురిని దోషులుగా నిర్దారించిన ఎన్‌ఐఏ కోర్టు..

సారాంశం

కేరళలో సంచలనం సృష్టించిన ప్రొఫెసర్ టీజే జోసెఫ్ చేతి నరికివేత కేసులో ఆరుగురు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం  దోషులుగా నిర్ధారించింది. మరో ఐదుగురిని నిర్దోషులుగా విడుదల చేసింది.

కేరళలో సంచలనం సృష్టించిన ప్రొఫెసర్ టీజే జోసెఫ్ చేతి నరికివేత కేసులో ఆరుగురు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం  దోషులుగా నిర్ధారించింది. మరో ఐదుగురిని నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ కేసు రెండో దశ విచారణకు సంబంధించి కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. కోర్టు దోషులుగా నిర్దారించిన వారిలో ఎంకే నాసర్, సజిల్, నజీబ్, ఎంకే నౌషాద్, పీపీ మహమ్మద్‌కుంజు, పీఎం అయూబ్‌లు ఉన్నారు. ఈ దాడికి నాజర్ సూత్రధారి అని విచారణ బృందం పేర్కొంది. ఇక, షఫీక్, అజీజ్ ఒడక్కలి, మహ్మద్ రఫీ, టీపీ సుబైర్, మన్సూర్‌లను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఎన్‌ఐఏ కోర్టు ప్రకారం.. ఈ కేసులో ఉగ్రవాద చర్య నిరూపించబడింది. ఇక, దోషులకు శిక్షను రేపు ప్రకటించనున్నారు. మొత్తం ఆరుగురు దోషుల బెయిల్‌ను రద్దు చేసిన కోర్టు వారిని కక్కనాడ్ జైలులో ఉంచాలని కోర్టు ఆదేశించింది.

అయితే ఈ ఘటన 2010లో చోటుచేసుకుంది. ప్రొఫెసర్ టీజే జోసెఫ్ రూపొందించిన ప్రశ్న పత్రంలో ఇస్లాం దూషణకు పాల్పడ్డారనే ఆరోపణతో మత ఛాందసవాదులు ఆయనపై దాడి చేసి చేయిని నరికేశారు. అయితే 2015 తర్వాత అరెస్టయిన వ్యక్తులకు సంబంధించిన రెండో దశ విచారణ బుధవారం పూర్తి కావడంతో కోర్టు ఈ తీర్పును ప్రకటించింది. ఇక, టీజే జోసెఫ్ స్పందిస్తూ.. ఆరుగురిని దోషులుగా నిర్ధారిస్తూ ఎన్‌ఐఏ కోర్టు వెలువరించిన తీర్పు తనకు సంతోషం కలిగించలేదని అన్నారు.

అంతకుముందు.. మొదటి దశలో విచారించిన నిందితులలో 13 మందికి కోర్టు శిక్ష విధించింది. అప్పుడు విచారణను ఎదుర్కొన్న 18 మంది సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా విడుదలయ్యారు. ఇక, ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అనిల్ కె భాస్కర్ వాదనలు విన్నారు. తొలిదశలో ప్రాసిక్యూషన్ తరపున పిజి మను వాదించగా.. సింధు రవిశంకర్ తర్వాత న్యాయవాదిగా వ్యవహరించారు.

ఇక, 2010 జూలై 4న తొడుపుజలోని న్యూమాన్ కాలేజీ ఫ్యాకల్టీగా పని చేస్తున్న జోసెఫ్‌పై ‘‘ప్రశ్న పత్రాన్ని సెట్ చేస్తున్నప్పుడు దైవదూషణకు పాల్పడ్డాడని’’ ప్రతీకారం తీర్చుకునేందుకు నిందితులు ముఠాగా ఏర్పడి ఈ నేరానికి పాల్పడ్డారు. మారుతీ ఓమ్నీలో ఎనిమిది మంది వ్యక్తుల బృందం మువట్టుపుళలోని జోసెఫ్  కుడి చేతిని దుండగులు నరికివేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సవాద్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నాడు.

జోసెఫ్ సోదరి స్టెల్లా జోసెఫ్ ప్రకార..  దాదాపు ఎనిమిది మంది వ్యక్తులు కత్తులు, ఆయుధాలతో వ్యాన్‌లో వచ్చి వారి వాహనాన్ని దారి మళ్లించారు. అద్దం పగలగొట్టి టీజే జోసఫ్‌ను బయటకు తీశారు. వారు అప్పుడు అతని కుడి చేతిని నరికి, ఎడమ తొడపై పొడిచాడు. దాడిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు తనపై, తన తల్లిపై దుండగులు దాడి చేశారు. ఆపై వారు బాంబులు పేల్చి సంఘటనా స్థలం నుండి పారిపోయారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసమన్నూర్‌కు చెందిన సవాద్, నార్త్ వజక్కుళానికి చెందిన పరీత్, కొత్తమంగళానికి చెందిన షోబిన్, అలువాకు చెందిన నాజర్, మువాట్టుపుజాకు చెందిన షాజిల్, పెరుంబవూరుకు చెందిన శంసుద్దీన్, షాన్వాస్, జమాల్‌లతో కూడిన ఎనిమిది మంది సభ్యుల బృందం ఈ దాడికి పాల్పడ్డారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం