తలకు గుండు.. విగ్గులో గోల్డ్: కొచ్చి అడ్డంగా బుక్కయిన యువకుడు

By Siva Kodati  |  First Published Oct 6, 2019, 10:38 AM IST

మాదక ద్రవ్యాలు, బంగారం ఇతర వస్తువులను దేశంలోకి అక్రమంగా తరలించాలని స్మగ్లర్లు చేయని ప్రయత్నం లేదు. వాళ్లు ఎన్ని ఎత్తులు వేసినా కస్టమ్స్ అధికారులు పైఎత్తులు వేస్తూ స్మగ్లర్ల ఆటకట్టిస్తున్నారు. తాజాగా కస్టమ్స్ అధికారులకు అనుమానం రాకుండా బ్రహ్మాండంగా ప్లాన్ చేసిన  ఓ వ్యక్తి చివరికి అడ్డంగా దొరికిపోయాడు


మాదక ద్రవ్యాలు, బంగారం ఇతర వస్తువులను దేశంలోకి అక్రమంగా తరలించాలని స్మగ్లర్లు చేయని ప్రయత్నం లేదు. వాళ్లు ఎన్ని ఎత్తులు వేసినా కస్టమ్స్ అధికారులు పైఎత్తులు వేస్తూ స్మగ్లర్ల ఆటకట్టిస్తున్నారు. తాజాగా కస్టమ్స్ అధికారులకు అనుమానం రాకుండా బ్రహ్మాండంగా ప్లాన్ చేసిన  ఓ వ్యక్తి చివరికి అడ్డంగా దొరికిపోయాడు.

వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రం మలప్పురానికి చెందిన నౌషద్ అనే వ్యక్తి షార్జా నుంచి కొచ్చి వస్తున్నాడు. కస్టమ్స్ అధికారులకు  దొరక్కుండా కిలో బంగారాన్ని తీసుకెళ్లాలని ప్లాన్ వేశాడు.

Latest Videos

undefined

ఇందుకోసం తల మధ్య భాగంలో గుండు గీసుకుని అక్కడ బంగారాన్ని దాచిపెట్టి విగ్గుతో  కవర్ చేశాడు. షార్జా  నుంచి కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నాడు.

అయితే అతనిపై కస్టమ్స్  అధికారులకు అనుమానం కలగడంతో విగ్గు తీసి చూశారు. మధ్యలో కనిపించిన బంగారాన్ని చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోయారు.

బంగారాన్ని స్వాధీనం చేసుకుని  నౌషద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే బార్సిలోనాలోనూ జరిగింది. ఓ వ్యక్తి రూ.24 లక్షల విలువైన కొకైన్‌ను విగ్గులో దాచుకుని దొరికిపోయాడు. 

click me!