మాజీకేంద్రమంత్రి చిదంబరంకు అస్వస్థత: ఎయిమ్స్ కు తరలింపు

By Nagaraju penumalaFirst Published Oct 5, 2019, 8:43 PM IST
Highlights

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో భాగంగా తీహార్ జైలులో రిమాండ్ లో ఉన్న ఆయన కడుపు నొప్పితో బాధపడటంతో జైలు సిబ్బంది అప్రమత్తమైంది. వెంటనే ఆయన్ను ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం ఆయన కోలుకున్నట్లు సమాచారం. 
 
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర ఆర్థికమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం అస్వస్థతకు గురయ్యారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆయన శనివారం అస్వస్థతకు గురయ్యారు.  

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో భాగంగా తీహార్ జైలులో రిమాండ్ లో ఉన్న ఆయన కడుపు నొప్పితో బాధపడటంతో జైలు సిబ్బంది అప్రమత్తమైంది. వెంటనే ఆయన్ను ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం ఆయన కోలుకున్నట్లు సమాచారం. 

ఇకపోతే జైల్లో తనకు అందిస్తున్న ఆహారం సరిపోవడం లేదని కోర్టుకు విన్నవించుకున్నారు. ఆహారం అందకపోవడం వల్ల నాలుగు కిలోల బరువు తగ్గానని పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కోర్టుకు తెలిపారు. తనకు ఇంటి భోజనం తెప్పించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవలే కోర్టును కోరారు. అయితే అందుకు కోర్టు అంగీకరించింది. అంతేకాదు  చిదంబరం జ్యుడీషియల్ కస్టడీని అక్టోబర్ 17వరకూ పొడిగించింది. 

click me!