కన్పించని మానత్వం: వందలాది మందిని రక్షించి హెల్ప్ అంటూ ప్రాధేయపడ్డా........

By narsimha lodeFirst Published Oct 3, 2018, 12:21 PM IST
Highlights

 మాయమైపోతున్నాడమ్మా... మనిషనేవాడు.. మచ్చుకైనా కానరాడు...మానవత్వం ఉన్నవాడు అంటూ  అభ్యుదయ కవి రాసిన మాటలు  ప్రస్తుత కాలంలో చోటు చేసుకొంటున్న  పరిస్థితులకు అద్దం పడుతున్నాయి

తిరువనంతపురం: మాయమైపోతున్నాడమ్మా... మనిషనేవాడు.. మచ్చుకైనా కానరాడు...మానవత్వం ఉన్నవాడు అంటూ  అభ్యుదయ కవి రాసిన మాటలు  ప్రస్తుత కాలంలో చోటు చేసుకొంటున్న  పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. కేరళలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకొంది. 

 రెండు మాసాల క్రితం కేరళ రాష్ట్రంలో వచ్చిన వరదల్లో అనేక మందిని సురక్షితంగా రక్షించిన జినేష్ జేరోన్  అనే వ్యక్తి  రోడ్డుప్రమాదంలో మరణించాడు. చివరిక్షణాల్లో తనను కాపాడాలని  జినేష్ చేసిన విన్నపం ఎవరూ పట్టించుకోలేదు. దీంతో అతను ప్రాణాలు వదిలాడు.

 సెప్టెంబర్ 30వ తేదీన తన నివాసానికి 12 కి.మీ. దూరంలో ఓ ట్రక్కు తాను ప్రయాణీస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో జినేష్  తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో ఆయనను తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డుపై  పడిపోయి సహాయం కోసం ఆర్థించాడు.

కానీ, జినేష్ ను కాపాడేందుకు ఎవరూ కూడ ముందుకు రాలేదని అతని స్నేహితుడొకరు ఆవేదనను వ్యక్తం చేశారు. ఇతరులకు సహాయం చేయడం కోసం ఆయన  తపించిపోయేవాడు... కానీ, తాను ప్రమాదంలో ఉంటే ఎవరూ కూడ రక్షించేందుకు ముందుకు రాలేదని స్నేహితుడు కన్నీళ్లు పెట్టుకొన్నాడు.

ప్రమాదం జరిగిన 30 నిమిషాల తర్వాత సంఘటనాస్థలానికి అంబులెన్స్ వచ్చింది.  అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జినేష్ మరణించాడని  స్నేహితుడు చెప్పారు. 

click me!