చిగురుటాకుల వణుకుతున్నకేరళ...87కు చేరిన మృతుల సంఖ్య

By sivanagaprasad KodatiFirst Published Aug 16, 2018, 1:44 PM IST
Highlights

భారీ వర్షాలు వరదలతో కేరళ చిగురుటాకులా వణుకుతుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళలో జనజీవనం స్థంభించిపోయింది. వరదల ప్రభావానికి 87మంది మృత్యువాత పడ్డారు.

కొచ్చి: భారీ వర్షాలు వరదలతో కేరళ చిగురుటాకులా వణుకుతుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళలో జనజీవనం స్థంభించిపోయింది. వరదల ప్రభావానికి 87మంది మృత్యువాత పడ్డారు. బుధవారం ఒక్కరోజే సుమారు 25 మంది మృత్యువాత పడటం గమనార్హం. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు డ్యామ్ లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కేరళ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 34 డ్యామ్ ల గేట్లు ఎత్తివేశారు. 

 వివాదాస్పదమైన ముళ్లపెరియార్‌ డ్యామ్‌ కు వరదనీరు ప్రమాదకర స్థాయికి చేరుకుంది. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ డ్యాం నిర్వహణ అంతా తమిళనాడు తమిళనాడు ప్రభుత్వం చూసుకుంటుంది. ఎప్పటికప్పుడు డ్యామ్ కు చేరుతున్న వరద నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. డ్యామ్‌ సామర్థ్యానికి నీటి మట్టం చేరుతుండటంతో వరద నీటిని స్లిస్ వేస్ ద్వారా అరేబియన్ సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. 

వరద ప్రభావానికి తీవ్రంగా నష్టపోయిన పతనంతిట్టాలో మూడు రక్షణ శాఖ దళాలు, ఎన్డీ ఆర్ ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఆ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. దక్షిణ నావల్ కమాండ్ శిక్షణ తరగతులను నిలిపివేసి కేరళ రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించింది. ఎర్నాకులం, తిర్చూరులలో వేగవంతంగా సహాయక చర్యలు అందించాలని సూచించింది. వీరితో పాటు రాష్ట్ర పోలీస్ శాఖ, రక్షణ శాఖ అధికారులు, పారామెలటరీ బలగాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలతోపాటు డ్యామ్ పరిసర ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాల నుంచి లక్షన్నర మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. 

చెలకుడి మరియు భూతాతంకెట్టు డ్యామ్ పరిసరప్రాంతాల ప్రజలు ఏదైన ఎత్తైన ప్రదేశాల్లో నిలబడాలని ఎయిర్ లిఫ్ట్ కు సహకరించాలని సీఎం పినరయి విజయన్ సూచించారు. ఇప్పటికే ఎయిర్ లిప్ట్ ఆపరేషన్ జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆపరేషన్ కు సహకరించాలని కోరారు. 

అటు కేరళలో దాదాపుగా రాకపోకలు స్థంభించాయి. వరద ధాటికి పలు రోడ్లు కొట్టుకుపోగా బ్రిడ్జ్ లు సైతం నీట మునిగాయి. దీంతో జనజీవనం ఎక్కడికక్కడ స్థంభించిపోయింది. ముట్టోమ్‌ యార్డ్‌ ప్రాంతంలో ప్రమాదకర స్థాయిలో వరద నీరు చేరడంతో మెట్రోరైల్‌ సర్వీసులను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు కొచ్చి మెట్రో రైల్‌ లిమిటెడ్‌(కేఎంఆర్‌ఎల్‌) స్పష్టం చేసింది. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత తిరిగి మెట్రో సేవలను ప్రారంభిచనున్నట్లు తెలిపింది.  

కేరళ చరిత్రలోనే తొలిసారిగా కొచ్చి విమానాశ్రయం మూసివేశారు. ప్రయాణికులతో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో దేశంలో నాలుగో విమానాశ్రయంగా కొచ్చి విమానాశ్రయాన్ని చెప్తారు. రన్ వే పై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో శనివారం వరకు రాకపోకలు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.  
 
కొన్ని ప్రాంతాల్లో బస్సుల రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. తిరువ్వల్ ఎర్నాకులం వెళ్లే ఎంసీ రోడ్డును మూసివేశారు. సలేం కొచ్చి జాతీయ రహదారిని పూర్తిగా మూసివేసినట్లు తెలిపారు. రాకపోకలను పూర్తిగా నిషేధించారు. 

అలాగే విద్యుత్ సరఫరా సైతం నిలిపివేసినట్లు కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డు లిమిటెడ్ ప్రకటించింది. విద్యుత్ స్థంభాలు కుప్పకూలిపోవడం, కేబుల్ కనెక్షన్లు ధ్వంసం కావడంతో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు ప్రకటించారు.  

కేరళలో నెలకొన్న వరదల పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరాతీశారు. సీఎం పినరయి విజయన్ కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో వరద పరిస్థితిపై ఆరా తీశాను. రాష్ట్ర వ్యాప్తంగా సహాయక చర్యలు మరింత పెంచాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రికి ఆదేశించాం. కేరళ ప్రజలకు అంతా మంచే జరగాలని ప్రార్థిస్తున్నాఅని ట్వీట్‌ చేశారు.

 కేరళలో  సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసేందుకు ఎన్డీఆర్ ఎఫ్ అదనపు బలగాలను పంపించినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. 

అటు రెండు ఏఎన్ 32ఎయిర్ క్రాఫ్ట్స్ మరియు ఒక ఐఎల్ 76 ఎయిర్ క్రాఫ్ట్ ల సహాయంతో పతనంతిట్టా మరియు అలపుజ ప్రాంతాల్లో రక్షణ సహాయక చర్యలు చేపడుతున్నారు.  రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరదప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చెయ్యాలని ఆదేశించినట్లు ట్వీట్ చేశారు. మరిన్ని హెలికాప్టర్లతో  సహాయక చర్యలు చేపట్టాలని, బోట్లు, లైఫ్ జాకెట్లు ఎక్కువగా వినియోగించి సహాయక చర్యల్లో పాల్గొనాలని డిఫెన్స్ కమిషనర్ కు ఆదేశించినట్లు తెలిపారు. కేరళలో తక్షణ సహాయం అందించేందుకు సహకరించాలని పలువురి ఎంపీలను కోరినట్లు తెలిపారు. ఎన్ ఆర్ లు కూడా తక్షణ సహాయం కోసం స్పందించినట్లు నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. 

కొల్లకడవు లోని అచెన్ కొయిల్ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రమాదకర స్థాయికి నీటిమట్టం చేరుకుంది. మత్స్యకారులు సైతం సహాయకర చర్యల్లో పాల్గొంటున్నారు. మత్య్యకారుల అనుభవంతో సముద్ర తీర ప్రాంతాల్లోని సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. 


కేరళ వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసేందుకు 40 ఎన్డీ ఆర్ ఎఫ్ బలగాలను పంపాల్సిందిగా కేంద్రం కోరినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. అలాగే మరో 10 హెలికాప్టర్లతో సహాయక చర్యలు చేపట్టాలని ఎయిర్ ఫోర్స్ అధికారులను కోరారు. 

 

ఈ వార్తలు చదవండి

కేరళలో వరద భీభత్సం...67కు చేరిన మృతుల సంఖ్య

పిక్చర్స్: కేరళలో వరద బీభత్సం

కేరళలో వరద భీభత్సం

పొంగిపొర్లుతున్న పంబానది.. శబరిమల ఆలయ దర్శనానికి ఆటంకం

కేరళను ముంచెత్తుతున్న వర్షాలు... ప్రమాదంలో ముళ్లపెరియార్ డ్యామ్

భారీ వర్షాలతో కేరళ కకావికలం

కేరళ అతలాకుతలం.. 29మంది మృతులు, 54వేలమంది నిరాశ్రయులు

 

 

click me!