మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులు.. కట్ చేస్తే.. నలభై ఏళ్ల జైలు శిక్ష, రూ.60 వేల జరిమానా

By Rajesh KarampooriFirst Published Mar 19, 2023, 4:13 PM IST
Highlights

11 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన 48 ఏళ్ల కామాంధుడికి 40 ఏళ్ల జైలు శిక్ష, రూ.60 వేల జరిమానా విధిస్తూ కేరళ కోర్టు సంచలన తీర్పు వెలువడించింది. 
 
 

నేటీ సమాజంలో ఆడపిల్లలకే కాదు.. మగపిల్లలకు కూడా రక్షణ కరువైంది. పలు చోట్ల బాలురపైనా కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి. కొంతమంది  కామాంధులు తన కామవాంఛ తీర్పుకోవడానికి .. బాలురుపై వికృతంగా ప్రవర్తిస్తున్నారు. మైనర్ బాలుర పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారు. ఆ చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.

అమాయకమైన బాలుర ప్రైవేట్ భాగాలపై దాడి చేస్తూ.. పైశాచిక ఆనందం పొందుతున్నారు. అలాంటి ఓ ఘటనపై కేరళ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఓ మైనర్ బాలుడిని లైంగికంగా వేధించిన కేసులో 48 ఏండ్ల కామాంధుడిని కఠినంగా శిక్షించింది. ఆ దుర్మార్గుడికి 40 ఏళ్ల జైలు శిక్ష, రూ.60 వేలు జరిమానా విధించింది కేరళ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు. ఈ ఘటనపై 2020 డిసెంబర్‌లో కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. పోలీస్ స్టేషన్ లో బాలుడి తండ్రి ఫిర్యాదు చేయడంలో వెలుగులోకి వచ్చింది. 

మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో కేరళలో 48 ఏళ్ల వ్యక్తికి 40 ఏళ్ల జైలు శిక్ష పడింది. దీంతో పాటు 60 వేల రూపాయల జరిమానా కూడా విధించారు. 2020లో 11 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులు జరిగాయని కేరళ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు తెలిపింది. ఈ కేసు విచారణ సమయంలో ప్రత్యేక న్యాయమూర్తి ఆజ్ సుదర్శన్ మాట్లాడుతూ..  లైంగిక వేధింపులు ప్రస్తుత క్షణానికే పరిమితం కాదన్నారు. దాని ప్రభావాలు ఒకరి జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడడం ద్వారా సమాజంలో చాలా మంది గుణపాఠం పొందుతారని, ఇలాంటి పనులు చేసే ముందు.. వారి మనసులో భయాన్ని నింపాల్సిన అవసరం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

బాలుడిపై లైంగిక వేధింపు 

ఆ వ్యక్తి తమ 11 ఏళ్ల బాలుడితో శారీరక సంబంధం పెట్టుకున్నాడని చిన్నారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అతనిపై సెక్షన్ 377 IPC, 3(a) r/w 4(2), 5(l)(m) r/w 6(l) పిల్లలు లైంగిక నేరాల నుండి రక్షణ చట్టం(పోక్సో)2012 కింద కేసులు నమోదు చేయబడ్డాయి. ఈ కేసులో 11 ఏళ్ల బాధిత బాలుడిని.. మద్యం,సిగార్లు లేదా గంజాయి తాగించేలా చేసి పలువురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే వాస్తవాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఆ బాలుడు సైకాలజిస్ట్ ముందు ఈ విషయాలు వెల్లడించారు.

ట్రాన్స్‌జెండర్‌కి కేరళ కోర్టు శిక్ష

అంతకుముందు.. రాష్ట్రంలో మొదటిసారిగా, ఏడేళ్ల క్రితం బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తిని కేరళ కోర్టు దోషిగా నిర్ధారించింది. తొలిసారిగా కేరళలో ఓ ట్రాన్స్‌జెండర్‌కు శిక్ష పడింది. ఈ కేసులో జడ్జి సుదర్శన్ మాట్లాడుతూ.. జరిమానా చెల్లించకుంటే నిందితుడు అదనంగా ఏడాది పాటు జైలులో గడపాల్సి ఉంటుందని తెలిపారు.
 

click me!