100 అడుగుల బావిలో చిక్కుకున్న వ్యక్తి మృతి.. 48 గంటల తర్వాత..

Published : Jul 11, 2023, 03:38 AM IST
100 అడుగుల బావిలో చిక్కుకున్న వ్యక్తి మృతి.. 48 గంటల తర్వాత..

సారాంశం

కేరళలోని విజింజమ్‌లో ఓ వ్యక్తి బావిలో పడి మట్టిలో సజీవ సమాధి అయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ప్రజల సహకారంతో 48 గంటల తర్వాత అతని మృతదేహాన్ని సోమవారం బావిలోంచి బయటకు తీశారు. ఆ వ్యక్తి అనుకోకుండా బావిలో పడిపోయాడని చెబుతున్నారు.

ఓ వ్యక్తి  వంద అడుగుల బావిలోకి దిగి చిక్కుకుపోయాడు. బురదలో కూరుకుపోయి సజీవ సమాధి అయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ప్రజల సహకారంతో అతని మృతదేహాన్ని 48 గంటల తర్వాత సోమవారం బావిలోంచి బయటకు తీశారు. ఆ వ్యక్తి బావిలో పని చేస్తుండగా.. ప్రమాదశాత్తు బావిలో పడిపోయాడని చెబుతున్నారు. ఈ ఘటన శనివారం కేరళలోని విజింజమ్‌లో చోటుచేసుకుంది.  

వివరాల్లోకెళ్తే.. తమిళనాడులోని పార్వతీపురానికి చెందిన మహారాజన్.. రెండు దశాబ్దాలుగా కేరళ లోని తిరువనంతపురంకు వచ్చి స్థిరపడ్డాడు. అతడు జీవనోపాధి కోసం కూలీ పనులు చేస్తుంటారు. ఎప్పటి లాగానే..విజింజం సమీపంలోని ముక్కోల వద్ద బావి లోపల రింగులు బిగించే పని ఒప్పుకున్నారు. ఈ క్రమంలో  జూలై 8న ఉదయం బావిలో దిగి తన పనిలో నిమగ్నమయ్యాడు. అనుకోకుండా బావిలో జారి పడ్డాడు. బావిలో మర్మమత్తు చేస్తుండటంతో అందులోని నీరు బురద మయం అయ్యాయి.

అదే సమయంలో భారీ మట్టి కుప్ప అతనిపై పడటంతో కిందకు నెట్టబడ్డాడు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు తక్షణమే రెస్క్యూ ప్రయత్నాలు ప్రారంభమైనప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. బావిలో చాలా నీరు ఉండడం, పై నుంచి నిరంతరంగా మట్టి పడిపోవడం వల్ల రెస్క్యూ ఆపరేషన్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రెస్క్యూ టీమ్ అధికారి తెలిపారు.  నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందం అర్ధరాత్రి సంఘటనా స్థలానికి చేరుకుందని, అయితే రాత్రి కావడంతో ఆపరేషన్‌లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారి తెలిపారు.

దాదాపు 48 గంటల తర్వాత మృతదేహాన్ని బయటకు తీశారు. సమాచారం ప్రకారం.. సోమవారం ఉదయం 10 గంటలకు వ్యక్తి మృతదేహాన్ని 48 గంటల తర్వాత బయటకు తీశారు. ఈ ప్రమాదం.. శనివారం ఉదయం 9.30 గంటలకు చోటుచేసుకుంది. విజింజం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది. స్థానిక ప్రజలు సుమారు 100 అడుగుల లోతులో ఉన్న 55 ఏళ్ల మహారాజన్‌ మృత దేహాన్ని బయటకు తీసే పనిలో సహాయం చేశారు. వివిధ షిఫ్టులలో, అగ్నిమాపక , రెస్క్యూ సర్వీసెస్‌లోని వివిధ స్టేషన్‌ల నుండి దాదాపు 75 మంది సిబ్బంది ఆపరేషన్‌లో నిమగ్నమై ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu