
న్యూఢిల్లీ: దేశంలో Congress లేకంటే ఎమర్జెన్సీ ఉండేది కాదనీ ప్రధాని Narendra Modi చెప్పారు. సిక్కుల ఊచకోత జరిగి ఉండేది కాదని కూడా మోడీ అభిప్రాయపడ్డారు. కాశ్మీర్ పండింట్లకు ఇలా జరిగి ఉండేది కాదని మోడీ చెప్పారు. .మహత్మాగాంధీ సైతం కాంగ్రెస్ ని కావాలని కోరుకోలేదని మోడీ గుర్తు చేశారు. కాంగ్రెస్ మైండ్ సెట్ అర్బన్ నక్సలైట్ల మాదిరిగా ఉందని మోడీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గోవా స్వాతంత్ర్యం కంటే తన ప్రతిష్ట గురించే నెహ్రు ఆందోళన చెందారని మోడీ గుర్తు చేశారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు Rajya Sabhaలో ప్రసంగించారు. సోమవారం నాడు లోక్‌సభలో ఆయన ప్రసంగించిన విషయం తెలిసిందే. వారసత్వ రాజకీయాలు దేశానికి ప్రమాదకరమని మోడీ తెలిపారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమన్నారు. కానీ, మీ నిరాశను ప్రజలపై రుద్దొద్దని కాంగ్రెస్ పై మోడీ విరుచుకు పడ్డారు.
రాష్ట్రాలు అభివృద్ది చెందితేనే దేశం అభివృద్ది చెందుతుందన్నారు.దేశ ప్రగతికి, ప్రాంతీయ ఆకాంక్షలకు మధ్య ఎలాంటి విబేధాలు కన్పించడం లేదని ప్రధాని తెలిపారు. భారత జాతీయ కాంగ్రెస్ పేరును ఫెడరేషన్ ఆఫ్ కాంగ్రెస్ గా మార్చాలని మోడీ కాంగ్రెస్ నేతలకు సూచించారు.
సబ్ కా ప్రయాస్ కలలను నెరవేర్చడంలో మహిళా సాధికారిత ప్రధాన ప్రాధాన్యతగా ప్రధాని తెలిపారుభేటీ బచావో భేటీ పడావో లింగ నిష్పత్తిని మెరుగు పరుస్తుందని ఆయన చెప్పారు. భారతదేశం యొక్క భవిష్యత్తుపై నమ్మకం ఉంచాలని తాను అందరిని అభ్యర్ధిస్తున్నానని చెప్పారు. చరిత్రపై అవగాహన ఉన్న కొంతమందికి ఉన్న అవగాహన కేవలం ఒక్క కుటుంబానికి మాత్రమే పరిమితమైందని కాంగ్రెస్ పై మోడీ తన దాడిని రెండో రోజూ కూడా కొనసాగించారు. ప్రజాస్వామ్యానికి ముప్పు గురించి మాట్లాడేవారంతా వారసత్వ రాజకీయాలతోనే ప్రమాదమనే విషయాన్ని గుర్తుంచకోవాన్నారు. తన ప్రసంగంలో రాహుల్ గాంధీకి కూడా ఆయన కౌంటరిచ్చారు. యూనియన్ ఆఫ్ స్టేట్స్ వ్యాఖ్యలపై మోడీ కౌంటరిచ్చారు.
INC పేరును ఫెడరేషన్ ఆఫ్ కాంగ్రెస్ గా మార్చాలని సూచించారు. అధికారంలో ఉన్న సమయంలో అభివృద్దిని కాంగ్రెస్ నేతలు అనుమతించలేదన్నారు. కానీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మాత్రం దేశ అభివృద్దిని అడ్డుకొంటున్నారని మోడీ మండిపడ్డారు. కరోనా సమయంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయన్నారు. కానీ అఖిలపక్ష సమావేశాన్ని కొన్ని పార్టీలు బహిష్కరించాయని ఆయన మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశాయి.
రాజ్యసభ నుండి కాంగ్రెస్ వాకౌట్
రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విమర్శలు చేస్తున్న సమయంలోనే రాజ్యసభ నుండి ఆ పార్టీ వాకౌట్ చేసింది. లోక్‌సభలో నిన్న రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కూడా కాంగ్రెస్ పై విరుచుకు పడ్డారు. రాజ్యసభలో ఇవాళ కూడా అదే స్థాయిలో ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో స్పందించారు. దేశంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు..కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు మరికొన్నేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండాలని ఆ పార్టీ వ్యవహరశైలి తెలుపుతుందన్నారు.