ఐసిస్‌లో చేరిన కేరళ వ్యక్తి.. లిబియాలో ఆత్మహుతి దాడి మిషన్‌లో పాల్గొని మృతి..!

Published : Aug 21, 2022, 03:52 PM ISTUpdated : Aug 21, 2022, 05:45 PM IST
 ఐసిస్‌లో చేరిన కేరళ వ్యక్తి.. లిబియాలో ఆత్మహుతి దాడి మిషన్‌లో పాల్గొని మృతి..!

సారాంశం

భారత్‌కు చెందిన ఓ వ్యక్తి ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో (ISIS) చేరి లిబియాలో జరిగిన ఆత్మహుతి దాడిలో పాల్గొన్నాడని ఆ సంస్థ మౌత్ పీస్ ది వాయిస్ ఆఫ్ ఖురాసన్ వెల్లడించింది. ఆత్మహూతి దాడిలో పాల్గొన్న ఆ వ్యక్తి మరణించాడని తెలిపింది. 

భారత్‌కు చెందిన ఓ వ్యక్తి ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో (ISIS) చేరి లిబియాలో జరిగిన ఆత్మహుతి దాడిలో పాల్గొన్నాడని ఆ సంస్థ మౌత్ పీస్ ది వాయిస్ ఆఫ్ ఖురాసన్ వెల్లడించింది. ఆత్మహూతి దాడిలో పాల్గొన్న ఆ వ్యక్తి మరణించాడని తెలిపింది. అతడు భారత్‌లోని కేరళకు చెందిన వ్యక్తి అని పేర్కొంది. ఆ వ్యక్తి కేరళలో జన్మించిన క్రైస్తవుడని.. మిడిల్ ఈస్ట్ లో ఉద్యోగం చేస్తూ ఇస్లాం మతంలోకి మారాడాని తెలిపింది. ఆ తర్వాత ఐసిస్ లో చేరి ఉగ్రవాద దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది. అయితే ఐసిస్ మౌత్ వెల్లడించిన ఈ వివరాలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. 

అయితే ఆ వ్యక్తి పేరు మాత్రం ఐసిస్ మౌత్ పీస్ ది వాయిస్ ఆఫ్ ఖురాసన్ వెల్లడించలేదు. అదే విధంగా లిబియాలో ఆత్మహూతి ఘటన జరిగిన సంవత్సరాన్ని కూడా పేర్కొనలేదు. అయితే ఆ నివేదిక ప్రకారం.. ఆ వ్యక్తి అబూబకర్ అల్హిద్ పేరుతో ఐసిస్‌తో కలిసి పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో భారత నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి. ది వాయిస్‌ ఆఫ్ ఖురాసన్ వెల్లడించిన వివరాలపై దర్యాప్తు జరుపుతున్నాయి. 

అయితే గతంలో కూడా ఇలాంటి వాదనలే వినిపించాయి. అప్పుడు నిఘా సంస్థలు, ఎన్‌ఐఏ, ఐబీలు విచారణ జరిపినా ఆ వ్యక్తి ఆచూకీ లభించలేదు. అప్పట్లో ఏదో విధంగా విదేశాలకు వెళ్లి కనిపించకుండా పోయిన వారిపైనే నిఘా సంస్థలు దృష్టి సారించాయి. విదేశాలకు వెళ్లి మతం మార్చుకుని ISISలో చేరిన క్రైస్తవ మతస్థుడిని వెతకడానికి చేసిన ఎటువంటి క్లూ లభించలేదు. అయితే ఐఎస్‌ఐఎస్‌ మౌత్‌పీస్‌ ద్వారా మళ్లీ అదే సమాచారం వెలువడిన నేపథ్యంలో.. మరోసారి విచారణ చేపట్టాలని నిఘా విభాగం నిర్ణయించింది. విదేశాలకు వెళ్లి తిరిగి రాని వారిపై దృష్టి సారించి మరోసారి విచారణ చేపట్టాలని భావిస్తుంది. 
 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం