రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఆటో డ్రైవర్: లాటరీలో రూ. 12 కోట్లు గెల్చుకొన్న జయపాలన్

Published : Sep 21, 2021, 11:11 AM IST
రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఆటో డ్రైవర్:  లాటరీలో రూ. 12 కోట్లు గెల్చుకొన్న జయపాలన్

సారాంశం

కేరళ రాష్ట్రానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. తనకు పట్టిన అదృష్టానికి ఆయన  ఆనందానికి అవధులు లేకుండాపోయింది. ఓనం లాటరీలో ఆటో డ్రైవర్ జయపాలన్ రూ. 12 కోట్లు గెలుపొందాడు. పన్నులు పోను ఆయనకు రూ. 7 కోట్లు దక్కనున్నాయి.


తిరువనంతపురం:  కేరళ రాష్ట్రానికి చెందిన ఓ ఆటో డ్రైవర్‌ని అదృష్టం వరించింది.తనకు నచ్చిన నెంబర్ తో లాటరీ కొనుగోలు చేసిన ఆటో డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. కేరళలోని ఓనం లాటరీ (onam lottery)  టికెట్టును ఆటో డ్రైవర్ జయపాలన్(jayapalan)  కొనుగోలు చేశాడు.కొచ్చికి సమీపంలోని మరడు ప్రాంతానికి చెందిన జయపాలన్  ఓనం లాటరీలో ఫస్ట్ ఫ్రైజ్ గెలుపొందాడు.ఆదివారం నాడు ఈ లాటరీ ఫలితాలను నిర్వాహకులు విడుదల చేశారు. టీఈ 645465 నెంబర్ గల టికెట్ కు ఫస్ట్ ప్రైజ్ దక్కింది.

ఈ నెల 10వ తేదీన ఈ లాటరీని డ్రైవర్ జయపాలన్ త్రిపురినింతలో కొనుగోలు చేశాడు. ఈ నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ గా ఉందని టికెట్ కొనుగోలు చేశాడు జయాపాలన్. అయితే ఫ్యాన్సీ నెంబరే ఆయనకు కలిసి వచ్చింది. ఫస్ట్ ప్రైజ్ కింద ఈ లాటీరీ టికెట్ కి రూ. 12 కోట్లు వస్తాయి. అయితే పన్నుల కింద రూ. 5 కోట్లు మినహాయించుకొని రూ. 7 కోట్లు ఆటో డ్రైవర్ కి అందించనున్నారు.


 

PREV
click me!

Recommended Stories

Bullet Train India: దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్, అమరావతి రూట్లలో గంటలో ప్రయాణం
Zero Poverty Mission : యూపీలో పేదరికంపై యోగి ప్రభుత్వ నిర్ణయాత్మక పోరాటం