ఇండియాలో గత 24 గంటల్లో 26,115 కరోనా కేసులు: పెరిగిన రికవరీ, ఐదు రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాప్తి

By narsimha lodeFirst Published Sep 21, 2021, 10:18 AM IST
Highlights

ఇండియాలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్టుగా రికార్డులు చెబుతున్నాయి.గత 24 గంటల్లో 26,115 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 3,34,78,419కి చేరుకొన్నాయి. కొత్తగా ఐదు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

న్యూఢిల్లీ: ఇండియా (india)లో  గత 24 గంటల్లో  26,115 కొత్త కేసులు (corona ) నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 3,34,78,419కి చేరుకొన్నాయి.ఇండియాలో కరోనా యాక్టివ్ కేసులు 3,19,575కి చేరాయి.దేశంలో 184 రోజుల తర్వాత యాక్టివ్ కేసుల సంఖ్య 3,19,575కి పడిపోవడం ఇదే ప్రథమంగా ఐసీఎంఆర్ రికార్డులు చెబుతున్నాయి.

గత 24 గంటల్లో 252 మంది కరోనాతో మరణించారు. దీంతో  దేశంలో కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 4,45,358కి చేరింది. ఇండియాలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 0.95 శాతంగా నమోదైంది. 2020 మార్చి నుండి ఇప్పటివరకు ఇదే అతి తక్కువగా రికార్డులు చెబుతున్నాయి.

దేశంలో కరోనా రోగుల రికవరీ  రేటు 97.72 శాతంగా నమోదైంది.దేశంలో గడిచిన గత 24 గంటల్లో 34,459 మంది కరోనా నుండి కోలుకొన్నారు.మరోవైపు మిజోరం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మేఘాలయా, కాశ్మీర్ రాష్ట్రాల్లో  కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 

click me!