శబరిమల తీర్పుకి మద్దతు పలికిన స్వామీజీ... ఆశ్రమానికి నిప్పు

Published : Oct 27, 2018, 12:28 PM IST
శబరిమల తీర్పుకి మద్దతు పలికిన స్వామీజీ... ఆశ్రమానికి నిప్పు

సారాంశం

సందీపానంద గిరి ఆశ్రమంపై దాడి చేసిన దుండగులు రెండు కార్లు, ఓ ద్విచక్రవాహనానికి నిప్పు పెట్టారు. 


శబరిమల ఆలయంలోని మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ.. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకి ఓ స్వామిజీ మద్దతు పలికారు. అంతే.. ఆ స్వామిజీ ఆశ్రమంపై ఆందోళన కారులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన తిరువనంతపురం లోని కుదంమాన్ కడవులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కుందమాన్‌కడవులోని స్వామి సందీపానంద గిరి ఆశ్రమంపై దాడి చేసిన దుండగులు రెండు కార్లు, ఓ ద్విచక్రవాహనానికి నిప్పు పెట్టారు. శనివారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

స్వామి సందీపానంద గిరి ఆశ్రమంపై దాడి ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందించారు. స్వామిజీ చర్యలను వ్యతిరేకించిన వారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని విజయన్‌ అన్నారు. అయితే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని ప్రభుత్వం ఎంతమాత్రం అంగీకరించబోదని సీఎం స్పష్టం చేశారు.

కేరళలోని పవిత్ర శబరిమల ఆలయంలోకి 10-50 మధ్య వయసు గల మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పునకు స్వామి సందీపానంద గిరి మద్దతిచ్చారు. దీంతో గతంలో ఆయనకు బెదిరింపులు కూడా వచ్చినట్లు తెలుస్తోంది.

కాగా.. సుప్రీం తీర్పుతో కేరళలో గత కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇటీవల మాసపూజల నిమిత్తం శబరిమల ఆలయాన్ని తెరిచారు. ఈ సమయంలో కొందరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే వీరిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకున్నాయి.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు గంట‌లో వెళ్లిపోవ‌చ్చు.. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌లో మ‌రో కీల‌క అడుగు
విజయ సంకల్ప యాత్రలో మోదీ స్పీచ్ కి దద్దరిల్లిన సభ | PM Narendra Modi Speech | Asianet News Telugu