
తిరువనంతపురం: విద్యాబుద్దులు నేర్పించి పిల్లలకు మార్గదర్శకంగా నిలవాల్సిన మదర్సా టీచర్ మైనర్ బాలికలను లైంగికంగా వేధించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకొంది.
విద్యాబుద్దులు నేర్పించాల్సిన టీచర్ పన్నెండు మందికి పైగా విద్యార్ధినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ నిందితుడిని పోలీసులు అరస్ట్ చేశారు. కేరళలోని కొట్టాయం జిల్లా కొడునగలూరులో స్థానిక మొహల్లా కమిటీ ఫిర్యాదుపై మదర్సా టీచర్ యూసుఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
పాతికేళ్ల వయస్సు నుండే బాలికలపై లైంగిక దాడులకు పాల్పడేవాడినని యూసుఫ్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. తాను చిన్నతనంలోనే లైంగిక వేధింపులకు గురైనట్టుగా చెప్పారు. తనపై లైంగిక దాడి చేసిన వ్యక్తి కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడించారు.