బీజేపీకి షాక్: కేబినెట్ విస్తరించిన నితీశ్, కమలానికి నో ఛాన్స్

By Siva KodatiFirst Published Jun 2, 2019, 3:13 PM IST
Highlights

జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీజేపీపై రగిలిపోతున్నారు. కేంద్ర మంత్రివర్గంలో తమ పార్టీకి ప్రాధాన్యం దక్కనందున.. కేబినెట్‌లో చేరేది లేదని ప్రకటించారు నితీశ్

జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీజేపీపై రగిలిపోతున్నారు. కేంద్ర మంత్రివర్గంలో తమ పార్టీకి ప్రాధాన్యం దక్కనందున.. కేబినెట్‌లో చేరేది లేదని ప్రకటించారు నితీశ్. తాజాగా తన మంత్రివర్గాన్ని విస్తరించారు.

కేబినెట్‌లోకి కొత్తగా మరో 8 మందికి చోటు కల్పించారు. జేడీయూ నేతలు అశోక్ చౌదరి. ర్యాం రజాక్, ఎల్ ప్రసాద్, భీమా భారతి, రామ్ సేవక్ సింగ్, సంజయ్ ఝా, నీరజ్ కుమార్, నరేంద్ర నారాయణ్ యాదవ్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

బీహార్‌లో బీజేపీ-జేడీయూ సంకీర్ణం కొనసాగుతున్నప్పటికీ , ఈ సారి మాత్రం విస్తరణలో బీజేపీకీ చోటు కల్పించలేదు. తమకు ఎన్డీఏ ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత కల్పించనందుకు నిరసనగానే నితీశ్.. బీజేపీకీ ధీటైన బదులు ఇచ్చినట్లు భావిస్తున్నారు.

తాజా విస్తరణతో బీహార్‌లో కేబినెట్ మంత్రుల సంఖ్య 33కు చేరింది. వచ్చే ఏడాది బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇదే చివరి మంత్రివర్గ విస్తరణగా చెప్పవచ్చు. 

click me!