కొత్త కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి, గణేశుడి ఫొటోలు ముద్రించాలి .. బీజేపీతో సహా ప్రతి పక్ష పార్టీల విమర్శలు

Published : Oct 27, 2022, 03:40 AM IST
కొత్త కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి, గణేశుడి ఫొటోలు ముద్రించాలి .. బీజేపీతో సహా ప్రతి పక్ష పార్టీల విమర్శలు

సారాంశం

కొత్త కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేశుడి చిత్రాలను ముద్రించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రిని కోరారు. దేశ ఆర్థిక శ్రేయస్సు కోసం  కొత్త నోట్లపై ఒకవైపు మహాత్మా గాంధీ ఫొటో, మరోవైపు లక్ష్మీ దేవి, వినాయకుడి ఫొటోలు ఉండాలని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలను ప్రత్యర్థి పార్టీలు కూడా విమర్శల వర్షం కురిపించాయి. ఆప్ తన హిందూ వ్యతిరేక ముఖాన్ని దాచడానికి ఇదొక  ప్రయత్నమని విమర్శించాయి. 

కరెన్సీ నోట్లపై దేవతామూర్తుల బొమ్మను ముద్రించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేయడంతో దేశంలో చర్చ మొదలైంది. కేవలం నోట్లపై దేవతా బొమ్మను ముద్రించడం ద్వారానే ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉంటే.. ఈ రోజు ఇండోనేషియా భారతదేశం కంటే చాలా రెట్లు సంపన్న దేశంగా మారాలని , ఆ దేశం గత కొన్నేళ్లుగా కరెన్సీ నోట్లపై గణేశుడి బొమ్మను ముద్రిస్తున్నారనీ, అసలూ ఢిల్లీ ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదన ఎందుకు చేశారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. కొత్త కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేశుడి చిత్రాలను ముద్రించాలని కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రిని కోరారు. దేశ ఆర్థిక శ్రేయస్సు కోసం  కొత్త నోట్లపై ఒకవైపు మహాత్మా గాంధీ ఫొటో, మరోవైపు లక్ష్మీ దేవి, వినాయకుడి ఫొటోలు ఉండాలని ఆయన అన్నారు. ఈ ప్రతిపాదనను మైనారిటీ వర్గాలు వ్యతిరేకించే అవకాశంపై అడిగిన ప్రశ్నకు కేజ్రీవాల్ స్పందిస్తూ..ముస్లిం మెజారిటీ దేశమైన ఇండోనేషియాలో గణేష్ చిత్రంతో కరెన్సీ నోట్లను ముద్రిస్తున్నారని చెప్పారు.

ఇండోనేషియా దీన్ని చేయగలిగితే, మనం ఎందుకు చేయకూడదు? ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండకూడదనీ, లక్ష్మీ దేవి శ్రేయస్సు, సంపదకు ప్రతీక అని, ఇది అందరికీ శ్రేయస్సు ఈ ప్రతిపాదనను సూచిస్తున్నట్టు తెలిపారు. ఆప్ హిందూత్వ రాజకీయాల బ్రాండ్‌ను పాటిస్తున్నారనే ఆరోపణలతో తాను కలత చెందనని అన్నారు. ఈ మేరకు తాను త్వరలోనే ప్రధాని మోదీకి లేఖ రాస్తానని అన్నారు. అమెరికా డాలర్ తో పోల్చితే రూపాయి విలువ రోజురోజుకీ క్షీణించిపోతోందని, దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచాలంటే మన ప్రయత్నాలు చేస్తూనే, సర్వశక్తిమంతుడైన భగవంతుడి అనుగ్రహాన్ని కూడా పొందాలని  సంచలన వ్యాఖ్యాలు చేశారు.  

కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీతో పాటు ప్రతిపక్షలు సైతం తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ వ్యాఖ్యలను బిజెపి తీవ్రంగా ఖండించింది. “దీపావళి జరుపుకున్నందుకు, రామమందిరానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారు నేడు..  రామ్-రామ్ మరియు లక్ష్మీ-గణేష్ పాటలు పాడుతున్నారు. ఇది వారి యూ టర్న్ రాజకీయాలకు పరాకాష్ట’’ అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు.

బీజేపీకి చెందిన ఈశాన్య ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ మాట్లాడుతూ..హిందూ దేవతలను అవమానించారని అన్నారు. కేజ్రీవాల్ ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తన అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తివారీ అన్నారు.

అరవింద్ కేజ్రీవాల్ విలేకరుల సమావేశం నిర్వహించినప్పటి నుండి  బిజెపి యంత్రాంగం అతని వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే.. టాపిక్ నుండి డైవర్ట్ కాకుండా..కేజ్రీవాల్ చేసిన విజ్ఞప్తికి  బిజెపి అనుకూలంగా ఉందా లేదా దానికి వ్యతిరేకంగా ఉందా అని సమాధానం ఇవ్వాలని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ అన్నారు.

ఇటు బీజేపీ సైతం ఆప్ వ్యాఖ్యలను వ్యతిరేకించింది. కేజ్రీవాల్ డిమాండ్ ఒక తెలివైన రాజకీయ ఎత్తుగడ అని, దీనిని స్వాగతించలేము లేదా వ్యతిరేకించలేము అని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై పార్టీ అధికారికంగా స్పందించలేదని తెలిపారు. CWC సభ్యుడు, పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీని మాట్లాడుతూ.. కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి ఫోటో నిస్సందేహంగా ఉండదనీ, కానీ తాను ఓ సమస్య కనుగొన్నననీ, మనం పాత కాలం నాటి నిబంధనలకు కట్టుబడి ఉండటం ప్రారంభించిన తర్వాత..వైవిధ్యమైన కరెన్సీ నోట్లపై ప్రాతినిధ్యం కోరుతూ చర్చ చేయడమేమిటని అన్నారు.  ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ..ఇలాంటి పనికిమాలిన ప్రకటనలు చేయకూడదనీ, ఇప్పటికీ పేదలు నోట్ల రద్దు విధ్వంసాన్ని గుర్తుచేసుకుంటూ భయాందోళనలకు గురవుతున్నారని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?