నియంత్రణ రేఖ వెంబడి పెరుగుతున్న చొరబాట్లు.. ఎన్ కౌంటర్లో పాకిస్తానీ ఉగ్రవాది హతం  

Published : Nov 19, 2022, 02:54 PM IST
నియంత్రణ రేఖ వెంబడి పెరుగుతున్న చొరబాట్లు.. ఎన్ కౌంటర్లో పాకిస్తానీ ఉగ్రవాది హతం  

సారాంశం

జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి సైనిక చర్యలో ఓ పాకిస్తానీ చొరబాటుదారుడు మరణించాడు. తద్వారా అనుమానిత ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసింది. ఈ మేరకు శనివారం ఓ అధికారి వెల్లడించారు. నౌషేరా సెక్టార్‌లోని కలాల్ ప్రాంతంలో చొరబాటు బిడ్ విఫలమైందని ఆయన చెప్పారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు అధికారి తెలిపారు.  

కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి: జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్ లో శనివారం భారత భద్రతాలు, పాక్ చొరబాటుదారులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. భారత సైనికులు ఒక ఉగ్రవాదిని హతమార్చగా.. మిగిలిన వారు భయంతో వెనుదిరిగారు. భారత భద్రతా బలగాల అప్రమత్తమై.. చొరబాటుదారుల ప్రయత్నాన్ని భగ్నం చేశారు. భద్రతా బలగాల తరపున ఉగ్రవాదులను లొంగిపోవాలని హెచ్చరించారు.కానీ.. లొంగిపోకపోవడంతో భారత సైనికులు కాల్పులు జరిపారు. ఇందులో ఓ పాక్ ఉగ్రవాది హతమయ్యాడు.   

నివేదికల ప్రకారం.. పాకిస్తాన్ నుండి భారత సరిహద్దులోకి ప్రవేశించాలని ఉగ్రవాదుల బృందం భావించింది. వారు నియంత్రణ రేఖలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ భారత సైనికులు ఉగ్రవాదుల చేష్టలను గమనించారు. తొలుత వారిని హెచ్చరించి లొంగిపోయేందుకు అవకాశం ఇచ్చారు. జవాన్ల మాటలను చొరబాటుదారులు పట్టించుకోకపోవడంతో .. కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో  ఓ ఆగంతకుడు మృతి చెందాడు.
 
చలికాలంలో పెరుగుతున్న చొరబాట్లు

చలికాలంలో కాశ్మీర్‌లోకి చొరబడేందుకు పాక్‌ ఉగ్రవాదులు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. నియంత్రణ రేఖపై మంచు కురుస్తున్న నేపథ్యంలో ఉగ్రవాదులు భారత సరిహద్దులోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ సరిహద్దుల్లో భారత సైనికులు తీవ్రంగా ప్రతిఘటిస్తారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుండి అందిన సమాచారం ప్రకారం.. రాజౌరీ, పూంచ్‌లను రాష్ట్ర కొత్త ఉగ్రవాద రాజధానిగా మార్చే ప్రక్రియలో ISI ఉందని తెలిపింది. 

ఈ కుట్రను అమలు చేయడానికి, రాజౌరీ, పూంచ్‌లకు ఆనుకుని ఉన్న నియంత్రణ రేఖపై దాదాపు డజను లాంచ్ ప్యాడ్‌లను ఏర్పాటు చేయాలని ఐఎస్ఐ ప్రయత్నిస్తుందని తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లోని కొండ ప్రాంతాల్లో మంచు కురుస్తుండటంతో.. కశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాటు మార్గాలన్నీ దాదాపు మూసుకుపోయాయి. అయితే కాశ్మీర్‌లో చొరబాట్లను కొనసాగించేందుకు ఐఎస్‌ఐ ప్రయత్నిస్తుందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తెలిపింది.  

PREV
click me!

Recommended Stories

మోదీ నివాసంలో పుతిన్‌.. చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్లిన ప్రధాని | Putin | Asianet News Telugu
Putin India Tour: ఢిల్లీలో ల్యాండ్ అయిన పుతిన్ అదిరిపోయే రేంజ్ లో మోదీ స్వాగతం | Asianet News Telugu