ట్రంప్ తో విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్: ఏపీ సీఎం వైఎస్ జగన్ డౌట్

By telugu teamFirst Published Feb 22, 2020, 12:07 PM IST
Highlights

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గౌరవార్థం ఈ నెల 25వ తేదీన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చే విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. జగన్ పాల్గొనడం మాత్రం సందేహంగానే ఉంది.

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్బంగా ఆయన గౌరవార్థం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ నెల 25వ తేదీన విందు ఇస్తున్నారు. ఈ విందు కార్యక్రమానికి దేశంలోని 8 మంది ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. వారిలో తెంలగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూడా ఉన్నారు. 

ట్రంప్ తో విందు కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కేసీఆర్ కు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. 25వ తేదీ రాత్రి 8 గంటలకు విందు కార్యక్రమం ఉంటుంది. ఈ నెల 24వ తేదీననే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా చెబుతున్నారు. మొత్తం 95 మందిని మాత్రమే ఈ విందుకు ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. 

తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు మహారాష్ట్ర, హర్యానా, బీహార్, ఒడిశా, కర్ణాటక ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ విందులో పాల్గొనడం సందేహంగానే ఉంది. ఆయనకు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది.  

డోనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 24వ తేదీన భారత్ వస్తున్నారు. ఆయన నేరుగా గుజరాత్ లోని అహ్మాదాబాద్ కు వస్తారు. అక్కడి మొతేరా స్టేడియంలో జరిగే నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. ట్రంప్ నకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మర్యాదపూర్వకంగా విందు ఇస్తున్నారు.  

click me!