ఫెడరల్ ఫ్రంట్: స్టాలిన్‌తో కేసీఆర్ చర్చలు

By narsimha lodeFirst Published May 13, 2019, 4:38 PM IST
Highlights

:డీఎంకె చీఫ్ స్టాలిన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారంనాడు సమావేశమయ్యారు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై స్టాలిన్‌తో కేసీఆర్ చర్చించనున్నారు.
 

చెన్నై:డీఎంకె చీఫ్ స్టాలిన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారంనాడు సమావేశమయ్యారు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై స్టాలిన్‌తో కేసీఆర్ చర్చించనున్నారు.

ఆదివారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంసభ్యులు, పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులతో కలిసి  ఆదివారం నాడు చెన్నైకు వెళ్లారు.ఆదివారం నాడు కేసీఆర్ ప్రత్యేక విమానంలో తిరుచ్చికి వెళ్లారు. ఇవాళ ఉదయం కేసీఆర్ రంగనాథఆలయంలో కుటుంబసభ్యులతో కలిసి కేసీఆర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు కేసీఆర్ డీఎంకె చీప్ స్టాలిన్‌తో సమావేశమయ్యారు. కేసీఆర్ వెంట ఎంపీలు వినోద్,సంతోష్‌లు ఉన్నారు. 
కేసీఆర్‌ను స్టాలిన్ సాదరంగా ఆహ్వానించారు. 

గతంలో కూడ కేసీఆర్‌ స్టాలిన్‌తో సమావేశమయ్యారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.  కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ఫెడరల్ ప్రంట్  కీలక పాత్ర పోషించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.
 

click me!