అహ్మదాబాద్: చిల్డ్రన్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

Published : May 13, 2019, 02:45 PM IST
అహ్మదాబాద్: చిల్డ్రన్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

సారాంశం

దట్టమైన పొగకమ్మేయడంతో ఆ ప్రాంతమంతా ఊపిరిపీల్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆస్పత్రిలోని నాలుగవ అంతస్థులో చెలరేగిన మంటలు రెప్పపాటులో మెుత్తం ఆస్పత్రి అంతా కమ్మేశాయి. 

గుజరాత్: గుజరాత్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్ లోని చిన్నపిల్లల ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పెద్దగా మంటలు ఎగిసిపడటంతో ప్రజలంతా భయంతో పరుగులు తీశారు. 

దట్టమైన పొగకమ్మేయడంతో ఆ ప్రాంతమంతా ఊపిరిపీల్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆస్పత్రిలోని నాలుగవ అంతస్థులో చెలరేగిన మంటలు రెప్పపాటులో మెుత్తం ఆస్పత్రి అంతా కమ్మేశాయి. 

దాదాపు 14 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై ఉన్నతాధికారుల విచారణకు ఆదేశించింది ప్రభుత్వం.  

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?