శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్ద‌రు ఉగ్రవాదుల‌ హతం

By Rajesh KarampooriFirst Published Sep 15, 2022, 12:54 AM IST
Highlights

జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అల్-ఖైదా అనుబంధ సంస్థ‌ అన్సార్ గజ్వత్-ఉల్ హింద్ (ఎజియుహెచ్)కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.  

జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య ఎన్‌కౌంటర్ జ‌రిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో  అల్-ఖైదా అనుబంధ సంస్థ‌ అన్సార్ గజ్వత్-ఉల్ హింద్ (ఎజియుహెచ్)కి చెందిన ఇద్దరు ఉగ్రవాది హతమయ్యాడు. శ్రీనగర్‌ జిల్లాలోని నౌగామ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి.

ఈ క్రమంలో భ‌ద్ర‌తా ద‌ళాల‌పై టెర్రరిస్టులు కాల్పులు జరిపారని, వెంట‌నే అప్ర‌మ‌త్తమైన భద్రతా దళాలు వారిపై కాల్పుల్లో జ‌ర‌ప‌డంతో  ఇద్ద‌రు ముష్కరుడు హతమయ్యాడని  అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఉగ్రవాదుల నుంచి ఒక ఏకే సిరీస్ రైఫిల్, 2 పిస్టల్స్, గ్రెనేడ్లు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్న‌ట్లు  తెలిపారు.  

శ్రీనగర్ జిల్లాలోని నౌగామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డేంగర్‌పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్న‌ట్టు స‌మాచారం రావ‌డంతో  పోలీసులు, ఆర్మీ (50RR) సంయుక్త బృందం సెర్చ్ అండ్ కార్డన్ ఆపరేషన్‌ను ప్రారంభించింద‌ని పోలీసు అధికారి తెలిపారు.

ఉగ్రవాదులకు ధీటైన సమాధానం 

సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా అనుమానాస్పద ప్రదేశానికి చేరుకున్న వెంటనే ఉగ్రవాదులు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల కాల్పులకు పోలీసులు, ఆర్మీ బృందం ధీటుగా సమాధానమివ్వడంతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన ఉగ్ర‌వాదుల‌ను పుల్వామాకు చెందిన ఎజాజ్ రసూల్ నాజర్, షాహిద్ అహ్మద్ అలియాస్ అబు హమ్జాగా గుర్తించారు.
 
అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కశ్మీర్) విజయ్ కుమార్ ట్వీట్ చేస్తూ, “చనిపోయిన ఉగ్రవాదులు ఉగ్రవాద సంస్థ AGUHకి అనుబంధంగా ఉన్నారు. ఇద్దరినీ పుల్వామాకు చెందిన ఎజాజ్ రసూల్ నాజర్ మరియు షాహిద్ అహ్మద్ అలియాస్ అబు హమ్జాగా గుర్తించారు. సెప్టెంబర్ 2, 2022న పుల్వామాలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన మునీర్-ఉల్-ఇస్లాం అనే కార్మికుడిపై ఉగ్రవాదుల దాడిలో వారు పాల్గొన్నారు. అని పేర్కొన్నారు. 

click me!