కాంగ్రెస్ ఎంపీ రాహుల్ కి షాక్... ముద్దుపెట్టిన కార్యకర్త

Published : Aug 28, 2019, 03:48 PM ISTUpdated : Aug 28, 2019, 05:31 PM IST
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ కి షాక్... ముద్దుపెట్టిన కార్యకర్త

సారాంశం

అయితే... ఊహించని ఈ ఘటనతో తొలుత రాహుల్ అవ్వాక్కైనప్పటికీ ఏ మాత్రం సహనం కోల్పోలేదు. కనీసం కార్యకర్తపై ఇసుమంత విసుగు కూడా చూపించకపోవడం గమనార్హం. చిరునవ్వుతోనూ కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించి వారి కష్టాలను తెలుసుకున్నారు.

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీకి ఊహించని అనుభవం ఎదురైంది. వయనాడ్ పర్యటనలో ఉన్న రాహుల్ కి ఓ కార్యకర్త షాక్ ఇచ్చాడు.  కాన్వాయ్ లో వెళ్తున్న రాహుల్ గాంధీ మధ్యలో తన వాహనాన్ని ఆపి ... కార్యకర్తలతో ముచ్చటించారు. కాగా... ఆ సమయంలో ఓ వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి రాహుల్ గాంధీకి ముద్దు పెట్టాడు.

అయితే... ఊహించని ఈ ఘటనతో తొలుత రాహుల్ అవ్వాక్కైనప్పటికీ ఏ మాత్రం సహనం కోల్పోలేదు. కనీసం కార్యకర్తపై ఇసుమంత విసుగు కూడా చూపించకపోవడం గమనార్హం. చిరునవ్వుతోనూ కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించి వారి కష్టాలను తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి మళ్లీ తన కాన్వాయిలో బయలుదేరారు.  కాగా... దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇదిలా ఉంటే ఇలాంటి అనుభవం రాహుల్ కి తొలిసారేమీ కాదు. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో ఆయన ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ సమయంలో బహిరంగసభలో ఓ మహిళ రాహుల్ ని ముద్దు పెట్టుకున్నారు. అప్పుడు కూడా రాహుల్ ఎంతో సహనంగా ప్రవర్తించారు.

 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu