ద్రవిడ, ఆత్మగౌరవ రాజకీయ ప్రతీక కరుణ

First Published Aug 7, 2018, 7:06 PM IST
Highlights

ఆత్మ గౌరవ, ద్రవిడ రాజకీయాలకు పెట్టింది పేరైన కరుణానిధి తమిళ సినిమాలో తన సిద్ధాంతాల ప్రచారానికి ‘పరాశక్తి’ని తొలిసారి ఉపయోగించుకున్నారు. ద్రవిడ ఉద్యమ సిద్దాంతాలు, విలువలకు మద్దతునిస్తూ నిర్మించిన ‘పరాశక్తి’ తమిళ సినిమాను మలుపు తిప్పింది.

ఆత్మ గౌరవ, ద్రవిడ రాజకీయాలకు పెట్టింది పేరైన కరుణానిధి తమిళ సినిమాలో తన సిద్ధాంతాల ప్రచారానికి ‘పరాశక్తి’ని తొలిసారి ఉపయోగించుకున్నారు. ద్రవిడ ఉద్యమ సిద్దాంతాలు, విలువలకు మద్దతునిస్తూ నిర్మించిన ‘పరాశక్తి’ తమిళ సినిమాను మలుపు తిప్పింది. తమిళ సినీ రంగానికి శివాజీ గణేశన్, ఎస్ ఎస్ రాజేంద్రన్ అనే ప్రముఖ నటులను పరిచయం చేసింది.

తొలుత పరాశక్తి సినిమాపై నిషేధం విధించినా 1952లో విడుదలైంది. వివాదాల మధ్య విడుదలైన ‘పరాశక్తి’ బాక్సాఫీసు వద్ద బద్ధలు కొట్టింది. పలు రికార్డులు నెలకొల్పిన ఈ సినిమా బ్రాహ్మణ వాదాన్ని విమర్శిస్తున్నదంటూ సంప్రదాయ (సనాతన) హిందువులు వ్యతిరేకించారు. 

click me!