స్పీకర్ అనర్హత వేటు... సుప్రీం కోర్టుకి రెబల్ ఎమ్మెల్యేలు

By telugu teamFirst Published Jul 27, 2019, 8:36 AM IST
Highlights

 స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేయాలని రెబల్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఈ మేరకు వారు సుప్రీం కోర్టు ను ఆశ్రయించనున్నారు. కర్ణాటక అసెంబ్లీలో నిర్వహించిన బల పరీక్షలో కుమారస్వామి ప్రభుత్వం బలాన్ని నిరూపించుకోలేకపోయింది.
 

కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న రెబల్ ఎమ్మెల్యేలపై కర్ణాటక శాసనసభ స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. కాగా... ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేయాలని రెబల్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఈ మేరకు వారు సుప్రీం కోర్టు ను ఆశ్రయించనున్నారు. కర్ణాటక అసెంబ్లీలో నిర్వహించిన బల పరీక్షలో కుమారస్వామి ప్రభుత్వం బలాన్ని నిరూపించుకోలేకపోయింది.
 
ఈ నేపథ్యంలో కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్. శంకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జర్కిహోళి, మహేశ్ కుమటహళ్లిలను కర్ణాటక స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. దీంతో స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ ‌చేస్తూ ఈ ముగ్గరు ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు.
 

click me!