కర్ణాటక : ఐఏఎస్ ల మధ్య గొడవ.. ఇద్దరిపై బదిలీ వేటు...

By AN TeluguFirst Published Jun 7, 2021, 11:44 AM IST
Highlights

మైసూరు జిల్లా నూతన కలెక్టర్ గా డా. బగాది గౌతమ్, కార్పొరేషన్ కమిషనర్ గా జి.లక్ష్మీ కాంత్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత కలెక్టర్ రోహిణి సింధూరి, కమిషనర్ శిల్పానాగ్ లు పరస్పర విమర్శల పర్వంతో ఇరుకునపడిన సర్కారు ఇద్దరినీ బదిలీ చేసింది.

మైసూరు జిల్లా నూతన కలెక్టర్ గా డా. బగాది గౌతమ్, కార్పొరేషన్ కమిషనర్ గా జి.లక్ష్మీ కాంత్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత కలెక్టర్ రోహిణి సింధూరి, కమిషనర్ శిల్పానాగ్ లు పరస్పర విమర్శల పర్వంతో ఇరుకునపడిన సర్కారు ఇద్దరినీ బదిలీ చేసింది.

రోహిణి సింధూరి రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ గా బదిలీ చేశారు. గ్రామీణాభివృద్ధి-పంచాయతీ రాజ్ లో ఈ గవర్నెన్స్ డైరెక్టర్ శిల్పానాగ్ ను నియమించారు. గౌతమ్, లక్ష్మీకాంత్ రెడ్డి ఆదివారమే బాధ్యతలను తీసుకున్నారు. 

కాగా, రోహిణి సింధూరి బెంగళూరులో సీఎం యడియూరప్పను కలిసి తన బదిలీని రద్దు చేయాలని కోరగా, ఆయన తిరస్కరించినట్లు తెలిసింది. తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన శిల్పానాగ్, మనసు మార్చుకుని కొత్త పోస్టులో చేరుతున్నట్లు తెలిపారు. 

కాగా, గతవారం ‘మైసూరులో పనిచేసే వాతావరణం ఏమాత్రం లేదు, అందుకే నేను సివిల్ సర్వీసు ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను’ అని మైసూరు కార్పొరేషన్ కమిషనర్ శిల్పా నాగ్ ప్రకటించారు. జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరి విధి నిర్వహణలో పదే పదే అడ్డొస్తున్నారని శిల్పానాగ్ ఆరోపించారు. 

గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజీనామా ప్రకటన చేశారు. ఆమె మాట్లాడుతూ రోహిణి సింధూరి తనను పని చేసుకోనివ్వడం లేదన్నారు. అడుగడుగున్నా అడ్డు వస్తున్నారని, ఇలాంటి దురంహంకార కలెక్టర్ ఎవరికీ వద్దని, తాను విసిగిపోయానంటూ భావోద్వేగానికి గురయ్యారు. 

ఒక ఐఎఎస్ అధికారికి, మరో ఐఏఎస్ అధికారికి మధ్య ఇటువంటి వివాదం సరికాదని, తనను టార్గెట్ చేయడంతో ఎంతో బాధపడ్డానని, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్వికి కూడా లేఖ రాశానని ఆమె తెలిపారు. చివరికి ఇక్కడ పనిచేయడం కంటే ఉద్యోగం నుంచి బయటకు రావడం మంచిదని భావించి రాజీనామా చేసినట్లు చెప్పారు. 

తాను కలెక్టర్ కు అన్ని విధాలా గౌరవం ఇచ్చానని, కానీ తనమీద ఆమెకు ఎందుకు పగ, కోపమో అర్థం కావడం లేదన్నారు. కాగా, శిల్పా నాగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మైసూరు కమిషనర్ గా నియమితులయ్యారు. ఆమె 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. మరోవైపు ఈ విషయమై ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. 

click me!