కర్ణాటక పబ్లిక్ సర్వీసెస్ ఎగ్జామ్స్ : మహిళలను మంగళసూత్రాలు, మెట్టేలు తీసేయాలని ఆదేశాలు...

By SumaBala Bukka  |  First Published Nov 6, 2023, 11:44 AM IST

హిందూ మహిళలను మంగళసూత్రాలు, మెట్టెలు తీయాలని చెప్పిన అధికారులు.. ముస్లింలను హిజాబ్ తో అనుమతించడం వివాదాలకు దారి తీస్తోంది. 


కర్ణాటక : కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఈ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థినులు పరీక్ష హాలులోకి ప్రవేశించే ముందు తమ 'మంగళసూత్ర'ను తీసివేయాలని అధికారులు కోరారు. వివాహిత హిందూ మహిళలు వివాహానికి చిహ్నంగా ధరించే మంగళసూత్రం, తాడుతో పాటు... విద్యార్థినులు చెవిపోగులు, గొలుసులు, కాలిపట్టాలు.. మట్టెలు సహా ఇతర ఆభరణాలను కూడా తీసివేయాలని ఒత్తిడి చేశారు. 

ఈ పరిణామంపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యే బసంగౌడ యత్నాల్ స్పందిస్తూ, ఈ నిబంధనలన్నీ కేవలం హిందువుల కోసమేనా? అని ఘాటుగా ప్రశ్నించారు.మంగళసూత్రం తీయమని కోరినట్లు తెలిపిన మహిళ మాట్లాడుతూ.. తనతో పాటు హిజాబ్ ధరించిన మహిళలను కూడా అధికారులు తనిఖీ చేశారని, అయితే వారిని ఏమీ తొలగించమని చెప్పకుండానే లోపలికి అనుమతించారని తెలిపింది.

Latest Videos

undefined

సీఐసీగా హీరాలాల్ సమారియా ప్రమాణం.. ఆ పదవి చేపట్టిన తొలి దళిత వ్యక్తి ఆయనే..

ఆమె దీనిమీద ఆవేదన వ్యక్తం చేస్తూ.. "హిందూ సంస్కృతిలో, మంగళసూత్రాన్ని తీసేయడం అంటే సెంటిమెంట్ ఉంటుంది. తీయాల్సినప్పుడు మాత్రమే వాటిని తీస్తాం. కానీ ఈ పరీక్ష కోసం నాతో మంగళసూత్రం, కాలి మెట్టెలు తీయించారు. వాటిని తీసివేసి లోపలికి వెళ్ళాను. ముస్లిం మహిళల హిజాబ్‌ని ఎలా తనిఖీ చేసి అనుమతించారో, మమ్మల్ని కూడా అలాగే తనిఖీ చేసి లోపలికి అనుమతించాల్సింది" అని విద్యార్థి తెలిపింది.

ఈ ఘటన కేపీఎస్సీ పరీక్ష కలబురగిలోని బాలికల ప్రభుత్వ ప్రీ-యూనివర్శిటీ కళాశాలలో జరిగింది. గ్రూప్ సి పోస్ట్ పరీక్షకు హాజరయ్యే మహిళా అభ్యర్థులు తమ మంగళసూత్రాలు, కాలి ఉంగరాలు, చెవిపోగులు, ఇతర లోహ వస్తువులను తీసివేయాలని.. తద్వారా పరీక్ష సమయంలో ఎటువంటి అవకతవకలకు అవకాశం ఇవ్వొద్దని అధికారులు ఆదేశించారు.

మంగళసూత్రాలను తొలగించేందుకు ఇష్టపడని వివాహితలకు పరీక్షా కేంద్రాల అధికారులు ప్రవేశం నిరాకరించారు. అదనంగా, ఒక అభ్యర్థి తన చెవిపోగులను తీసివేయడంలో ఇబ్బంది పడింది. అవి చెవి నుంచి రాకపోవడంతో స్వర్ణకారుని సహాయం తీసుకోవలసి వచ్చింది.  మరోవైపు, హిజాబ్‌లు ధరించిన మహిళలను అధికారులు తనిఖీ చేస్తున్నట్లు తెలిపింది. కానీ వారిని పరీక్ష హాల్‌లోకి హిజాబ్ తోనే అనుమతించారు. ఇది వివాదానికి మరింత ఆజ్యం పోసింది. పరీక్షా విధానం నిష్పాక్షికత, స్థిరత్వం గురించి ప్రశ్నలకు దారితీసింది.

వివిధ బోర్డులు. కార్పొరేషన్లలో పోస్టులను భర్తీ చేయడానికి అభ్యర్థులను రిక్రూట్ చేసే కేఈఏ పరీక్షలో కొంతమంది విద్యార్థులు చీటింగ్‌ చేసిన విషయం వెలుగు చూసిన కొద్ది రోజుల తర్వాత ఈ పరిణామం జరిగింది. ఆ సమయంలో పరీక్ష హాలులో విద్యార్థులు బ్లూటూత్ తో కాపీయింగ్ కు పాల్పడుతూ పట్టుబడ్డారు.

click me!