ఫామ్‌హౌస్ నుండి ఇంటికి: మద్దతుదారులతో డీకే శివకుమార్ భేటీ

Published : May 15, 2023, 06:29 PM IST
 ఫామ్‌హౌస్  నుండి  ఇంటికి:    మద్దతుదారులతో  డీకే శివకుమార్ భేటీ

సారాంశం

కాంగ్రెస్ పార్టీ  నేత  సూర్జేవాలాతో  సమావేశం  ముగిసిన తర్వాత  ఇవాళ సాయంత్రం  డీకే శివకుమార్ తన ఇంటికి చేరుకున్నారు.  మద్దతుదారులతో  కొద్దిసేపు  సమావేశమయ్యారు.  


బెంగుళూరు:  కర్ణాటక పీసీసీ చీఫ్  డీకే శివకుమార్  ఫాం హౌస్ నుండి  సోమవారంనాడు సాయంత్రం  తన నివాసానికి  చేరుకున్నారు.   ఇవాళ  ఉదయం  బెంగుళూరులోని  హోటల్ లో  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  సూర్జేవాలాతో  సమావేశమయ్యారు.  మూడు గంటల పాటు  సూర్జేవాలతో  డీకే శివకుమార్  సమావేశమయ్యారు.ఈ సమావేశం ముగిసిన  తర్వాత  డీకే శివకుమార్  ఫాం హౌస్ కు వెళ్లారు.  ఫాం హౌస్ నుండి  ఆయన  సాయంత్రం  ఇంటికిచేరకున్నారు.   డీకే  శివకుమార్ కు సీఎం పదవిని  ఇవ్వాలని ఆయన  మద్దతుదారులు పెద్ద ఎత్తున  నినాదాలు  చేశారు.  మద్దతుదారులతో  డీకే శివకుమార్ సమావేశమయ్యారు.  ఎనిమిది మంది  ఎమ్మెల్యేలు  కూడా  డీకే శివకుమార్ నివాసానికి వచ్చారు.   అయితే  మద్దతుదారులతో  కొద్దిసేపు మాత్రమే డీకే శివకుమార్ సమావేశమయ్యారు. ఆ తర్వాత  ఆయన మీడియాతో మాట్లాడారు.

ఇవాళ  ఢిల్లీకి రావాలని   డీకే శివకుమార్ కు  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుండి  పిలుపు వచ్చింది.  కర్ణాటక మాజీ సీఎం  సిద్దరామయ్య  పార్టీ నాయకత్వం నుండి  పిలుపు రావడంతో  ఆయన   న్యూఢిల్లీ వెళ్లారు.  కర్ణాటక పీసీసీ చీఫ్  డీకే శివకుమార్ న్యూఢిల్లీ టూర్ విషయమై  స్పష్టత రాలేదు. ఇవాళ డీకే శివకుమార్ పుట్టిన రోజు . దీంతో   దేవాలయాల్లో  పూజలు చేసే కార్యక్రమాలున్నందున  ఢిల్లీ టూర్ విషయమై  ఇంకా నిర్ణయం తీసుకోలేదని    డీకే శివకుమార్ ప్రకటించారు. 

also read:నేను ఒంటరిని, నా మద్దతు దారుల సంఖ్య చెప్పను: డీకే శివకుమార్ సంచలనం

కర్ణాటక సీఎం  పదవి విషయమై  డీకే శివకుమార్  ఆసక్తిగా  ఉన్నారు.  ఈ పదవి విషయమై  మాజీ సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య  తీవ్రమైన పోటీ నెలకొంది.  అమితే  మెజారిటీ  ఎమ్మెల్యేలు   సిద్దరామయ్యకు  మద్దతుగా  నిలిచారని సమాచారం.  కాంగ్రెస్ పార్టీ  అధిష్టానం  పిలుపు మేరకు  ఇప్పటికే  సిద్దరామయ్య  ఢిల్లీకి వెళ్లారు. డీకే శివకుమార్ మాత్రం  ఢిల్లీ వెళ్లే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

PREV
click me!

Recommended Stories

52 KM Concrete Road in 6 Days: 6 రోజుల్లో 52 కిలోమీటర్లు రెండు గిన్నీస్ రికార్డులు| Asianet Telugu
DMart : ఉద్యోగులకు డీమార్ట్ స్పెషల్ డిస్కౌంట్స్, బంపర్ ఆఫర్లు.. భారీగా డబ్బులు సేవ్..!