ఇంట్లో ఎవరూ లేని సమయంలో..  ప్రభుత్వ అధికారిణిపై దారుణం..  

By Rajesh Karampoori  |  First Published Nov 6, 2023, 3:17 AM IST

కర్ణాటక ప్రభుత్వ అధికారి బెంగళూరులోని తన అధికార నివాసంలో హత్యకు గురయ్యారు. అయితే.. ఆమెను ఎవరూ హత్య చేసి ఉంటారు? ఆమె హత్య వెనుక గల తెలియరాలేదు


కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది.  37 ఏళ్ల  మహిళా ప్రభుత్వ అధికారిణి దారుణ హత్యకు గురైంది. హత్యకు గురైన మహిళను కెఎస్ ప్రతిమగా గుర్తించారు. ఆమె కర్ణాటక ప్రభుత్వ మైనింగ్ అండ్ జియాలజీ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమె హత్య తన అధికారి ఇంట్లోనే చోటుచేసుకుంది.

రెండంతస్తుల ఇంట్లో ఆమె ఒంటరిగా ఉండేది. ఆమె భర్త, పిల్లలు తన స్వగ్రామం శివమొగ్గలో ఉంటారు. ఘటన జరిగిన సమయంలో ఆమె భర్త, బిడ్డ శివమొగ్గ వెళ్లారని కొన్ని మీడియా కథనాలలో కూడా చెబుతున్నాయి.ఆదివారం ఉదయం ప్రతిమ సోదరుడు వారి ఇంటికి చేరుకోగా, తన సోదరి శవమై కనిపించింది. అంతకుముందు రోజు రాత్రి కూడా ప్రతిమకు ఫోన్ చేసాడు, కానీ ఫోన్ కాల్ కి ఎటువంటి స్పందన రాలేదు. వెంటనే తన సోదరి మృతిపై పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన వ్యక్తి కోసం వెతుకులాటతోపాటు అన్ని ఆధారాలతో దర్యాప్తు చేస్తున్నారు.

Latest Videos

undefined

 ఇప్పటివరకు వెల్లడైన సమాచారం ప్రకారం శనివారం సాయంత్రం 6 గంటల వరకు ప్రతిమ తన కార్యాలయంలోనే పని చేస్తోంది. అనంతరం ఆమె తన ఇంటికి వెళ్లిపోయింది. రాత్రి 8 గంటలకు ఆమెను తన నివాసంలో దింపినట్లు డ్రైవర్ చెప్పాడు. హత్యకు గల కారణాలు కూడా ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ప్రాథమికంగా చూస్తే హంతకుల ఉద్దేశం దోపిడీగా కనిపించడం లేదని పోలీసులు చెబుతున్నారు. కానీ, ఆమె ఇంట్లో ఖరీదైన వస్తువు కనిపించలేదనీ, పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఫోరెన్సిక్ బృందాలను రప్పించి ఆధారాలు సేకరించారు. ఆమె ఫోన్‌ను కూడా తనిఖీ చేస్తున్నారు.

ఈ ఘటనపై కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించాారు. ఈ విషయం తనకు తెలిసిందని, విచారణ జరిపిస్తానని అన్నారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు. ప్రతిమ ఇంతకుముందు మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా పలుమార్లు కఠిన చర్యలు తీసుకుంది. ఈ విషయమై ఆమెకు బెదిరింపులు కూడా వచ్చాయి. ఆ తన సోషల్ మీడియాలో అక్రమ మైనింగ్, ల్యాండ్ మాఫియాపై కీలక సమాచారాన్ని షేర్ చేసినట్టు తెలుస్తోంది.

click me!