వరుసగా నాలుగో రోజు లక్షకు దిగువన కరోనా: ఇండియాలో తగ్గుతున్న కోవిడ్ కేసులు

By narsimha lodeFirst Published Jun 11, 2021, 9:47 AM IST
Highlights

 ఇండియాలో కరోనా కేసులు వరుసగా నాలుగో రోజు కూడ లక్షలోపు నమోదయ్యాయి.  గత 24 గంటల్లో 91,702 కరోనా కేసులు రికార్డయ్యాయి. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి.

న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసులు వరుసగా నాలుగో రోజు కూడ లక్షలోపు నమోదయ్యాయి.  గత 24 గంటల్లో 91,702 కరోనా కేసులు రికార్డయ్యాయి. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి.దేశంలో కరోనా కేసులు 2,92,74,823కి చేరుకొన్నాయి. ఒక్క రోజులో  కరోనాతో 3,403 మంది మరణించారు. నిన్నటితో పోలిస్తే కరోనా మరణాలు తగ్గడం ఊరటనిస్తోంది. దేశ చరిత్రలో కరోనాతో 6 వేలకు పైగా మంది మరణించడం  ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

also read:ఇండియాలో రికార్డుస్థాయిలో కరోనా మరణాలు: స్వల్పంగా పెరిగిన కోవిడ్ కేసులు

 గత 24 గంటల వ్యవధిలో కరోనా నుండి 1,34, 580 మంది కోలుకొన్నారు.ఇప్పటివరకు దేశంలో కరోనా నుండి కోలుకొన్నవారి సంఖ్య 2,77,90,073కి చేరింది.కరోనాతో దేశంలో మరణించిన వారి సంఖ్య 3,63,079కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి.గత కొన్ని రోజులుగా  కరోనా కేసుల నమోదులో తగ్గుదల కన్పించడంతో పాటు రికవరీ సంఖ్య పెరగిందని వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రాల్లో అమలు చేసిన లాక్ డౌన్ మంచి ఫలితాలను ఇచ్చింది. ఢిల్లీలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. దీంతో ఆ రాష్ట్రం అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించింది. 

click me!