మామ లైంగిక వేధింపులు.. ఏడంతస్తుల బిల్డింగ్ మీదినుంచి దూకి వివాహిత ఆత్మహత్య..

Published : Aug 04, 2021, 11:54 AM IST
మామ లైంగిక వేధింపులు.. ఏడంతస్తుల బిల్డింగ్ మీదినుంచి దూకి వివాహిత ఆత్మహత్య..

సారాంశం

ఆమె వివాహిత భర్త ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవనం సాగిస్తోంది. హటాత్తుగా గత సోమవారం ఆమె తాము నివసిస్తున్న 7వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య వెనుక ఆమె మామ ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అహ్మదాబాద్లో సోమవారం ఈ ఘటన కలకలం రేపింది.

భర్త, ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్న యువతి జీవితంలోకి కీచకుడిలా ప్రవేశించాడు మేనమామ.. ఆమెను లైంగికంగా వేధిస్తూ చివరికి ఆత్మహత్య చేసుకుని చనిపోయేవరకు తీసుకువచ్చాడు. ఈ దారుణ ఘటన అహ్మాదాబాద్ లో జరిగింది. 

ఆమె వివాహిత భర్త ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవనం సాగిస్తోంది. హటాత్తుగా గత సోమవారం ఆమె తాము నివసిస్తున్న 7వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య వెనుక ఆమె మామ ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అహ్మదాబాద్లో సోమవారం ఈ ఘటన కలకలం రేపింది.

ఎల్లిస్‌బ్రిడ్జ్ ప్రాంతంలోని భూదార్‌పురాలో నివసిస్తున్న చందు భాయ్ పర్మార్ గ్యారేజీ లో పని చేస్తున్నాడు. అతని కుమార్తె ఆర్తికి ఐదేళ్ల క్రితం ఆరవల్లికి చెందిన విష్ణుతో వివాహం జరిగింది. అయితే ఆర్తిని ఆమె మామ దినేష్ ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్తి డెలివరీ కోసం పుట్టింటికి వచ్చినప్పుడు వివాహేతర సంబంధం గురించి బలవంతం చేశాడు.

మాస్క్ ధరించి.. కన్న కూతురిని కిడ్నాప్ చేసిన తల్లి..!

 ఆమె అందుకు నిరాకరించింది. డెలివరీ తరువాత పిల్లలతో కలిసి భర్త దగ్గరకు వెళ్ళిపోయింది. ఆ విషయం తెలుసుకున్న దినేష్ కూడా అహ్మదాబాద్ వెళ్లి ఆర్తి ఇంటికి సమీపంలోనే  ఓ గది అద్దెకు తీసుకున్నాడు.

కొన్ని రోజుల క్రితం, ఆర్తి ఇంటికి వచ్చిన దినేష్ ఆర్తిని బలవంతంగా వాకింగ్ కి తీసుకెళ్ళాడు. భర్తను, తండ్రిని చంపేస్తానని బెదిరించడంతో ఆమె దినేష్ తో కలిసి వాకింగ్ కు బయలుదేరింది. ఆ విషయం ఆర్తి భర్త విష్ణుకు తెలియడంతో తన మామ గారికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దినేష్ నుంచి వేధింపులు ఎదురవుతుండడం, భర్త, తండ్రి మందలిస్తుండడంతో  ఆమె ఆ ఒత్తిడిని భరించలేకపోయింది. తాను నివసిస్తున్న 7వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దినేష్ ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu