భూ వివాదం .. పరిష్కరించమని కోరితే, ఫ్యామిలీ మొత్తాన్ని కాల్చేస్తానన్న మంత్రి

Siva Kodati |  
Published : Aug 31, 2022, 04:38 PM IST
భూ వివాదం .. పరిష్కరించమని కోరితే, ఫ్యామిలీ మొత్తాన్ని కాల్చేస్తానన్న మంత్రి

సారాంశం

కర్ణాటక రాష్ట్ర పర్యాటక, పర్యావరణ శాఖ మంత్రి ఆనంద్ సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ భూ వివాదానికి సంబంధించి దళిత కుటుంబాన్ని కాల్చి చంపుతానంటూ బెదిరించడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.   

ఓ భూ వివాదానికి సంబంధించి దళిత కుటుంబాన్ని కాల్చి చంపుతానంటూ బెదిరించారో రాష్ట్ర మంత్రి. వివరాల్లోకి వెళితే... కర్ణాటక రాష్ట్ర పర్యాటక, పర్యావరణ శాఖ మంత్రి ఆనంద్ సింగ్ మంగళవారం హోస్పేట్ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో పోలప్ప అనే దళితుడు.. భూ వివాదంలో తనను కొందరు ఇబ్బంది పెడుతున్నారని మంత్రితో గోడు వెళ్లబోసుకున్నాడు. తన సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరారు. 

అయితే మంత్రి ఆనంద్ సింగ్ నుంచి భరోసాకు బదులు బెదిరింపలు ఎదురుకావడంతో బాధితుడు ఆశ్చర్యపోయాడు. తాము చెప్పినట్లు చేయాలని లేదంటే నీ కుటుంబం మొత్తాన్ని కాల్చిపడేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు మంత్రి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రితో పాటు మరో ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. అయితే.. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం బాధిత కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు యత్నించారు. దీంతో అక్కడే వున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ahmedabad International Kite Festival సంక్రాంతి సంబరాల్లో పతంగ్ లు ఎగరేసిన మోదీ| Asianet News Telugu
Digital Health : ఇక వైద్యరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ... కీలక పరిణామాలు