
మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండెజ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆర్థిక నేరగాడు సుకేష్ చంద్రశేఖర్ ప్రధాని నిందితుడిగా ఉన్న రూ. 200 కోట్ల దోపిడి కేసుకు సంబంధించి నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 26న కోర్టుకు హాజరు కావాలని అందులో పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్‌ను పాటియాలా హౌస్ కోర్టు పరిగణలోకి తీసుకుంది. దానిపై విచారణ చేపట్టిన కోర్టు హాజరు కావాలని.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు సమన్లు జారీ చేసింది.
ఇక, రూ. 215 కోట్ల దోపిడీ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఈడీ నిందితురాలిగా పేర్కొంది. ఆ కేసులో ఇటీవల దాఖలు చేసిన అనుబంధ చార్జ్‌షీట్‌లో ఆమె పేరును చేర్చింది. దోపిడి చేసిన డబ్బు నుంచి ఆమె లబ్ది పొందినట్టుగా దర్యాప్తులో గుర్తించినట్టుగా ఈడీ వర్గాలు తెలిపాయి. సుకేష్ చంద్రశేఖర్ నేరస్థుడని, దోపిడీదారుడని జాక్వెలిన్‌కు తెలుసునని ఛార్జిషీట్‌లో పేర్కొంది.
ఇక, ఈ కేసుకు సంబంధించి జాక్వెలిన్‌ను చెందిన రూ. 7.27 కోట్లను ఈడీ అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తుల్లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరుతో ఉన్న రూ.7.12 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ కేసును జాక్వెలిన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేశారు. అయితే తాను 2017లో చంద్రశేఖర్‌ను కలిశానని జాక్వెలిన్ ఈడీకి తెలిపారు.
ఏప్రిల్‌లో విడుదల చేసిన ప్రకటనలో దోపిడీ వంటి చట్టవిరుద్ధమైన చర్యల ద్వారా సంపాదించిన మొత్తం రూ. 5.71 కోట్లను చంద్రశేఖర్ ఆమెకు బహుమతులుగా ఇచ్చాడని ఈడీ పేర్కొంది. అలాగే.. ఆమెపై దర్యాప్తు చేసిన విషయాన్ని ప్రధానంగా పేర్కొంది. చంద్రశేఖర్ ఇచ్చిన బహుమతులతో పాటు, హవాలా ఆపరేటర్ అయిన అవతార్ సింగ్ కొచ్చర్ ద్వారా జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కుటుంబ సభ్యులకు 1,72,913 యూఎస్ డాల్లర్ల మొత్తాన్ని అందించాడు.