Karnataka:  ప్రియురాలి కోసం హంత‌కుడుగా మారిన ప్రియుడు.. మ‌రో ఐదుగురికి హత్యకు స్కెచ్‌!

By Rajesh KFirst Published Aug 10, 2022, 3:59 AM IST
Highlights

Karnataka: కర్ణాటకలో ఓ షాకింగ్ కేసు తెరపైకి వచ్చింది. నిందితుడు తన ప్రియురాలితో కలిసి ముగ్గురు మహిళలను హతమార్చి మృతదేహాలను ముక్కలుగా చేసి పారవేసాడు. ఈ హత్యలన్నీ వేర్వేరు సమయాల్లో జరిగాయి. ఇది మాత్రమే కాదు, మరో ఐదుగురు మహిళలను చంపడానికి ప్లాన్ చేశాడు.

Karnataka: కర్ణాటకలో ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వ‌చ్చింది. 35 ఏళ్ల ఓ నిందితుడు ముగ్గురు మహిళలను అత్యంత దారుణంగా హత్య చేసి.. వారి మృత‌దేహాల‌ను ఛిద్రం చేసి పారవేసారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా చాలా తెలివిగా దారుణాల‌కు పాల్ప‌డేవాడు. కానీ, ఓ చిన్న త‌ప్పిదంతో చివ‌రికి పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. నిందితుడు మరో ఐదుగురు మహిళలను హతమార్చేందుకు ప్లాన్ చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. నిందితుడిని రామనగర జిల్లా కుదురుకు చెందిన టి సిద్దలింగప్పగా గుర్తించారు. నిందితుడితో పాటు అత‌నికి స‌హక‌రించిన  ఆయ‌న‌ ప్రియురాలిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ద‌ర్యాప్తులో షాకింగ్ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. గత కొన్ని నెలలుగా నిందితుడు ఈ ఘటనలన్నీ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు సిద్దలింగప్పను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు రామనగర జిల్లాలోని కుదుర్‌కు చెందిన సిద్ధలింగప్పగా గుర్తించారు. ఇత‌నికి  కొన్నేళ్ల క్రితం చంద్ర‌క‌ళ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచ‌యం ప్రేమ‌గా మారింది. అనంత‌రం శారీకంగా కూడా ఒక్క‌టయ్యారు. అయితే.. ఇక్క‌డ ట్విట్ ఏంటంటే..? ఆ మ‌హిళ ఓ సెక్స్ వర్కర్. అస‌లు విష‌యం తెలుసుకుని షాక్ గురయ్యాడు. కానీ, ఆ యువ‌తిపై ప్రేమ‌ను చంపుకోలేక‌.. ఆమె.. ప‌డుపు వృత్తిలోకి ఎలా ప్రవేశించిందనే గురించి తెలుసుకున్నాడు. తన ప్రియురాలిని బ‌ల‌వంతంగా వ్య‌భిచారంలోకి ఇచ్చార‌నీ, ఎలాగైనా త‌న ప్రియురాలికి ద్రోహం చేస చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్ర‌మంలో ఈ హత్యలు చేయ‌డానికి సిద్ద‌ప‌డ్డాడు. త‌న ప్రియురాలు కూడా నిందితుడికి సహకరించింది. 

ఈ క్ర‌మంలో మే నెలలో బెంగళూరులో తొలి మహిళను నిందితుడు సిద్దలింగప్ప హత్య చేశాడు. అనంతరం మృత దేహాన్ని కోసి వేర్వేరు ప్రాంతాల్లో పడేశారు. దీని తర్వాత..  నిందితులు మే 30 మరియు జూన్ 3 న మైసూర్‌లో మరో ఇద్దరు మహిళలను హత్య చేశారు. ఈ సంఘటనలన్నింటిలో అతడికి త‌న‌ స్నేహితురాలు మద్దతు ఇచ్చింది. దీంతో పాటు మరో 5 మంది మహిళలను హత్య చేయాలని నిందితుడు భావించాడు. 

ఇదిలా ఉంటే.. జూన్ 8న మండ్యలో పోలీసుల‌కు ఛిద్రమైన మృతదేహం లభ్యమైంది. ఆ తర్వాత అలాంటిదే మరో మృతదేహం లభ్యమైంది. ఈ రెండు మృతదేహాలు ఒకదానికొకటి 25 కిలోమీటర్ల దూరంలో కనిపించినప్పటికీ, వాటి మధ్య సాధారణ లింక్ ఉందనీ, అలాగే.. రెండు మృతదేహాల దిగువ భాగాలను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసును బెంగుళూర్ పోలీసులు చాలా సీరియ‌స్ గా తీసుకుంది. 45 మంది పోలీసులు  అధికారులను సమీకరించి తొమ్మిది బృందాలను ఏర్పాటు చేశారు. సిద్ధలింగప్పను బెంగళూరులోని ఆయన ఇంట్లో అరెస్టు చేశారు. నిందితులు డబ్బు కోసమే ముగ్గురు మహిళలను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

మైసూర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు విచారణలో నిందితుడు చెప్పాడు. నిందితులు ముందుగా మహిళల గొంతుకోసి చంపారు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికారు. అనంతరం మృతదేహాన్ని మండ్యలోని వివిధ ప్రాంతాల్లో పడేశారని పోలీసుల విచార‌ణలో తేలింది.

click me!