Bihar Politics: 'ఈ రోజు వారి అవినీతి అంత‌మైందా?' బీహార్ సీఎంపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన కేంద్ర మాజీ మంత్రి

By Rajesh KFirst Published Aug 10, 2022, 2:45 AM IST
Highlights

Bihar Politics: బీహార్ లో రాజకీయ స‌మీక‌ర‌ణాల శ‌రవేగంగా మారుతుండ‌టంపై కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. సీఎం నితీష్ కుమార్ పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించాడు.  

Bihar Politics: బీహార్ లో రాజకీయ స‌మీక‌ర‌ణాల శ‌రవేగంగా మారుతున్నాయి. అనూహ్య పరిణామాల న‌డుమ బీజేపీతో నితీష్ కుమార్ పొత్తు తెంచుకోవ‌డం.. అనంత‌రం.. నితీష్‌ సీఎం పదవికి రాజీనామా చేయ‌డం.ఆ వెంట‌నే రాజీనామా లేఖను గవర్నర్‌కు అందించ‌డం. అనంతరం..లాలూ ప్రసాద్‌ సతీమణి ర‌బ్రీదేవి నివాసంలో కీలక సమావేశం నిర్వ‌హించ‌డం వంటి అనేక అనూష్య‌ ప‌రిమాణాలు చోటుచేసుకున్నాయి.

తాజాగా ఈ ప‌రిణామాలపై బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. నితీష్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని ప్ర‌శ్న‌ల వ‌ర్షాన్ని కురిపించారు. ఐదుసార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీశ్ కుమార్ రెండోసారి బీజేపీతో తెగతెంపులు చేసుకోవడం ద్వారా అధికారాన్ని అవమానించారని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. ప్రధాని మోదీ వల్లే తనకు 2019, 2020లో రెండుసార్లు అధికారం వచ్చిందని, అయితే బీజేపీతో పొత్తును తెంచుకున్నానని చెప్పారు.

2020 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గెలవలేదా? 2019 ఎన్నికల్లో సొంతంగా గెలిచావా..? అని నితీష్ కుమార్ ను ప్ర‌శ్నించారు. బీజేపీ మ‌ద్ద‌తులోనే మీలో 14 మంది ఎంపీ లోక్‌సభకు వెళ్లారు.. బీహార్‌ అధికారాన్ని అవమానించారు. మీరు ఎలా అనుకుంటే.. అలా చేస్తారా? చేయగలరా? అని రవిశంకర్‌ ప్రసాద్ నిల‌దీశారు. నితీష్ కుమార్ గతంలో కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ ల మ‌హాకూటమిఅవినీతికి పాల్పడింద‌ని వారిని వదిలిపెట్టి, బీజేపీలో చేరారని అన్నారు.
 
ఈ రోజు ఏమి జరిగింది?  వారి అవినీతి అంతమైందా? బీహార్ ప్రజల ఆశయాల‌ను, అధికారాన్ని పదేపదే ఎందుకు అవమానిస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. బీజేపీ మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెడితే.. ఎందుకు ఉండిపోయారు? 2020లోనే గుడ్ బై చెప్పిఉండాల్సింద‌ని రవిశంకర్ ప్రసాద్ మరో ప్రశ్న వేశారు.

బీహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీతో పొత్తుకు స్వస్తి పలికారు. లాలూ యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్, ఇతర పార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దావా వేశారు. నితీష్ కుమార్ విభజన గురించి తెలిసినా ఆ పార్టీ ఎలాంటి ప్రయత్నం చేయలేదని మంగ‌ళ‌వారం తెల్లవారుజామున బీజేపీ వర్గాలు తెలిపాయి. నితీష్ కుమార్ జాతీయ ఆశయాలను కలిగి ఉన్నారని, 2024 సార్వత్రిక ఎన్నికలలో ప్రతిపక్షానికి నాయకత్వం వహించడానికి ఇది మంచి ఎంపికగా భావించడం వల్ల బిజెపికి ఈ నమ్మకం ఏర్పడిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ క్ర‌మంలో సీఎం నితీష్ కుమార్ నిర్ణయాత్మక చర్య తీసుకున్నారు. గత కొన్ని వారాలుగా.. ఆయ‌న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా యొక్క అనేక కార్యక్రమాలను గైర్హ‌జర‌య్యారు. బిజెపి తన జనతాదళ్ యునైటెడ్‌ను విభజించడానికి ప్రయత్నిస్తోందని నితీష్ కుమార్ భయపడ్డారని పార్టీ వర్గాలు తెలిపాయి. అదే విధంగా శివసేనలో చీలిపోయి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టార‌నీ, త‌న‌ను కూడా బీజేపీ టార్గెట్ చేస్తుంద‌ని సీఎం నితీష్ భావించి ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచారం.

click me!