కర్నాటకలో పరువు హత్య.. తల్లిదండ్రులు తనను వదలరని..ముందే ఊహించానని, పోలీసులకు లేఖ రాసిన యువతి...

Published : Jun 10, 2022, 07:50 AM IST
కర్నాటకలో పరువు హత్య.. తల్లిదండ్రులు తనను వదలరని..ముందే ఊహించానని, పోలీసులకు లేఖ రాసిన యువతి...

సారాంశం

కూతురు కులాంతర ప్రేమ వివాహం చేసుకుందన్న అక్కసుతో తల్లిదండ్రులు దారుణానికి తెగబడ్డారు. పక్కా ప్లాన్ తో కూతుర్ని హతమార్చారు. అయితే ఈ విషయం తనకు ముందే తెలుసంటూ కూతురు రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. 

మైసూరు :  ప్రేమకు పణంగా తన ప్రాణం పోతుందని.. అదీ తల్లిదండ్రుల చేతిలోనేనని ఆ యువతి ఊహించింది నిజమే అయ్యింది. Mysore Districtలోని పిరియాపట్టణ తాలూకా కగ్గుండి గ్రామంలో Dalit కులానికి చెందిన యువకుడిని ప్రేమించి, పెళ్లి చేసుకుందన్న కోపంతో కూతుర్ని తల్లిదండ్రులు Murder చేసిన సంఘటన అంతటా సంచలనం సృష్టిస్తోంది. తల్లిదండ్రులు సురేష్, బేబీ తనని వదలరని, చంపడానికి కూడా వెనుకాడరు అని హతురాలు, పియుసి చదివే శాలిని(17) రాసిన సుదీర్ఘ లేఖను పోలీసులు కనుగొన్నారు.

హత్య జరగడానికి ముందు శాలిని అన్ని వివరాలతో పిరియా పట్టణ పోలీసులకు మూడు పేజీల letter రాసింది. తాను చనిపోతే అందుకు తల్లిదండ్రులే కారణమని.. నన్ను హత్య చేయడానికి వారు మాస్టర్ ప్లాన్  సిద్ధం చేశారని అందులో పేర్కొంది. తన జీవితంలో ఎలాంటి సంతోషం లేదని, తల్లిదండ్రులు చిత్రహింసలకు గురి చేసేవారిని ఆవేదన వ్యక్తం చేసింది. ఒకవేళ తాను మరణిస్తే ప్రియుడు మంజునాథ్ కు ఎలాంటి సంబంధం లేదని తల్లిదండ్రులు మాత్రమే దీనికి కారణం అని స్పష్టం చేసింది.

ఏడాది కిందట ఒక పరువు హత్య..
కాగా,  గత ఏడాది జూన్ లో ఒక పరువు హత్య మైసూరు జిల్లాలో జరిగింది.  ఇతర కులాలకు చెందిన యువకుడిని ప్రేమిస్తోంది అని.. గాయత్రీ అనే యువతిని ఆమె తండ్రి జయరాం పొలంలో నరికి చంపి.. పోలీసులకు లొంగిపోయాడు. ఈ నేపథ్యంలో జిల్లాలో పరువు హత్యలు పెరుగుతున్నాయని ఆందోళన నెలకొంది. 

హైదరాబాద్ లోనూ పరువు హత్యలు.. 
కాగా, గతనెలలో హైదరాబాద్ లో జరిగిన ఇలాంటి పరువు హత్యలు కలకలం రేపాయి. హైదరాబాద్ నడిబొడ్డున మే 20న మరో పరువు హత్య జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఇటీవల సరూర్నగర్లో నాగరాజును అమ్మాయి కుటుంబ సభ్యులు కిరాతకంగా హత్య చేసిన ఘటన మరువక ముందే..  తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.  హైదరాబాద్ నగరంలోని బేగంబజార్ చేపల మార్కెట్ సమీపంలో ఒక యువ వ్యాపారి మే 20 రాత్రి Hyderabad honor killingకు గురయ్యాడు. కులాంతర వివాహం చేసుకున్నందుకే ఆయనను అంతమొందించిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏసీపీ సతీష్ కుమార్, సీఐ అజయ్ కుమార్ లు తెలిపిన వివరాల ప్రకారం…బేగంబజార్ కోల్సావాడికి చెందిన neeraj kumar panwar (22) పల్లీల వ్యాపారం చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన సంజన (20)ను  ఏడాదిన్నర కిందట love marriage చేసుకున్నాడు.

వీరికి నెలన్నర క్రితం బాబు పుట్టాడు. ఈ క్రమంలో సంజన కుటుంబీకులు నీరజ్ మీద ఇంకా కక్షపెంచుకున్నట్లు తెలుస్తోంది. సంజన సోదరుడు నీరజ్ ను ఆరునెలలుగా చంపాలని చూస్తున్నాడు.  వారం రోజుల నుంచి నీరజ్ షాప్ నుంచి ఇంటికి వెళ్లే వరకు ఏ టైంలో ఏం చేస్తున్నాడు.. అనే విషయాన్ని సంజన సోదరుడు  గమనించాడు. శుక్రవారం వాతావరణం మేఘావృతమై ఉండటంతో పాటు.. జనసంచారం తక్కువగా ఉండటంతో.. ఇదే అదనుగా భావించి స్నేహితులకు సమాచారం అందించాడు. వారు అక్కడికి చేరుకుని రోడ్డు దాటుతుండగా వెనకనుంచి వచ్చి నీరజ్ మీద దాడి చేశారు. అతని తలపై గ్రానైట్ రాయితో మోదారు.

ఆ తర్వాత కొబ్బరిబోండాల కత్తితో పొడిచి పారిపోయారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి వచ్చేసరికి నీరజ్ పన్వార్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే అతడిని షాహీనాయత్ పోలీసులు ఉస్మానియా  ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. నీరజ్ ను చంపింది ఐదుగురు అని నిర్ధారించుకున్న పోలీసులు… సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి.. పది మందిని అదుపులోకి తీసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?