కర్ణాటక హనీ‌ట్రాప్: సినీ హీరోయిన్ల పాత్ర?

Published : Dec 05, 2019, 11:53 AM IST
కర్ణాటక హనీ‌ట్రాప్: సినీ హీరోయిన్ల పాత్ర?

సారాంశం

కర్ణాటక రాష్ట్రంలోని హనీట్రాప్ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను హనీట్రాప్ చేసిన కేసులో కొందరు సినీ హీరోయిన్లకు కూడ సంబంధం ఉందనే కోణంలో  పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు.

శాండల్‌వుడ్‌కు చెందిన ముగ్గురు నటీమణుల పాత్ర ఇందులో ఉన్నట్లు సీసీబీ పోలీసులు విచారణలో గుర్తించినట్లు తెలిసింది. ఒకరు ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ కాగా, మరో ఇద్దరు రెండు, మూడు సినిమాల్లో నటించిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరిన్ని సాక్ష్యాలను సేకరించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. 

ఈ కేసులో పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న సినీ నటి సుమారు 25 సినిమాల్లో నిటించిందని పోలీసులు చెబుతున్నారు.మరో తార చిన్న సినిమాలు టీవీ సీరియళ్లు, రియాల్టీ షోలలో కనిపించారు.

 ఇక మూడో నటి బహుభాషా చిత్రాల్లో నటించిన హీరోయిన్‌గా గుర్తించారు. వారం క్రితం బహిర్గతమైన హనీట్రాప్‌ బాగోతంలో పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల శృంగార వీడియోలు బయటపడ్డాయి.

 రాఘవేంద్ర అనే వ్యక్తి తన ప్రియురాలు, కొందరు యువతులను ఎమ్మెల్యేల వద్దకు పంపి పరిచయాలు పెంచుకున్నాడు. వారితో నాయకులు గడుపుతున్న రహస్య వీడియోలు సేకరించి భారీగా డబ్బు డిమాండ్‌ చేసింది. దీంతో  బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం రాఘవేంద్ర, అతని ప్రియురాలు పోలీసుల అదుపులో ఉన్నారు.

ఈ కేసు విచారణ సమయంలో ఈ విషయం వెలుగు చూసింది.దీంతో ఈ కేసును మరింత లోతుగా విచారణ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. సినీ హీరోయిన్ల పాత్ర ఎంత ఉందనే విషయమై పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu