KARNATAKA HIJAB ROW: "అది ప్రాథమిక హ‌క్కుల ఉల్లంఘ‌నే":ఏఐఎంఐఎం అధినేత ఒవైసీ

Published : Feb 09, 2022, 02:33 PM IST
KARNATAKA HIJAB ROW:  "అది ప్రాథమిక హ‌క్కుల ఉల్లంఘ‌నే":ఏఐఎంఐఎం అధినేత ఒవైసీ

సారాంశం

KARNATAKA HIJAB ROW: ముస్లిం యువ‌తులు ఎప్ప‌టినుంచో హిజ‌బ్ ధ‌రిస్తున్నార‌ని ఇప్పుడు దీనిపై అభ్యంత‌రాలు ఎందుకు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని  ఇది పూర్తిగా వివ‌క్షతో కూడుకున్న‌ద‌ని మండిప‌డ్డారు. ఏ ఒక్క‌రి రాజ్యాంగ హ‌క్కును నిరాక‌రించ‌డం స‌రైంది కాద‌ని ఏఐఎంఐఎం అధినేత ఒవైసీ అన్నారు.   

KARNATAKA HIJAB ROW:  కర్ణాటకలో హిజాబ్ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. హిజాబ్ ధ‌రించిన విద్యార్థుల‌ను విద్యాసంస్థ‌ల్లోకి  అనుమ‌తించ‌పోవ‌డంపై తీవ్ర దూమారం రేగుతోంది. రాష్ట్రంలోని ప‌లు న‌గ‌రాల్లో హిజాబ్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు జరగడంతో.. ఈ వివాదానికి రాజ‌కీయ రంగు పులుముకుంది. దీంతో  విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాల్సిన పరిస్థితులు త‌లెత్తాయి. మరోవైపు, దీనిపై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు.. శాంతియుతంగా ఉండాలని ప్రజలు, విద్యార్థులకు సూచించింది.

తాజా వివాదం పై .. ఏఐఎంఐఎం అధినేత ఒవైసీ స్పందించారు. ముస్లిం యువ‌తులు హిజాబ్ ధరించ‌డాన్ని వ్య‌తిరేకించ స‌రికాద‌నీ,  వారు ఎప్ప‌టి నుంచో హిజాబ్ ధ‌రిస్తున్నార‌నీ, ఇప్పుడూ దీని మీద అభ్యంత‌రాలు వ్య‌క్తం చేయ‌డమేమిటని ఏఐఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ ప్ర‌శ్నించారు. ముస్లిం యువ‌తుల‌ను హిజ‌బ్ ఆధారంగా వేరు చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, హిజాబ్ ధ‌రించ‌డాన్ని నిరాకరించడం రాజ్యాంగం క‌ల్పించిన‌ ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని ఏఐఎంఐఎం అధినేత ఒవైసీ అన్నారు.హిజ‌బ్‌పై బీజేపీ అన‌వ‌స‌ర రాద్ధాంతం సృష్టిస్తోంద‌ని మండిప‌డ్డారు.

ఏమి ధరించాలి లేదా ఏమి తినాలి అని ఎవరూ నిర్దేశించలేరని వివిధ సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టం చేస్తున్నాయ‌నీ, కర్ణాటక ప్ర‌భుత్వం.. విద్యాసంస్థ‌ల్లో ముస్లీం బాలిక‌లు హిజాబ్ ధరించడాన్ని ఎందుకు వ్య‌తిరేకించింద‌ని ప్ర‌శ్నించారు. హిజాబ్ ధరించినందుకు ముస్లిం మహిళలను  వేరు చేస్తారని ఒవైసీ అన్నారు.

‘బీజేపీ సమాధానం చెప్పాలి’

హిజాబ్ వివాదానికి ప్రధాన కార‌ణం అధికార బీజేపీనేని ఆరోపించారు. ఈ అంశాన్ని బీజేపీయే సృష్టించిందని, రాష్ట్రంలో బీజేపీనే అధికారంలో ఉందన్నారు. బేటీ బ‌చావో..బేటీ ప‌ఢావో అని బీజేపీ నిన‌దిస్తుండ‌గా అస‌లు హిజ‌బ్ వ్య‌వ‌హారంలో మ‌హిళా సాధికార‌త ఎక్క‌డ ఉంద‌ని ప్ర‌శ్నించారు.  స్కూటీపై కాలేజీకి వచ్చిన ఒక  ముస్లీం యువతుల‌ను కాషాయ‌మూక చుట్టుముట్టినప్పుడు.. మహిళా సాధికారత ఎక్క‌డ ఉందో ? బీజేపీ సమాధానం చెప్పాలని అన్నారు.  ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 22 శాతం ముస్లిం బాలికలు (3-25 సంవత్సరాల వయస్సు) గల పాఠశాలకు వెళ్లలేవ‌డం లేద‌నీ ఇదేనా మీ  మహిళా సాధికారత అని ప్ర‌శ్నించారు.

ముస్లీం అమ్మాయిలు చాలా కాలంగా హిజాబ్ ధరిస్తున్నారు. అందులో తప్పేముంది? ఇది ఎవరికైనా ఎలా ఇబ్బంది కలిగిస్తుంది? ఇది పూర్తి వివక్ష. 1960 లో అమెరికాలో ఉన్న ప‌రిస్థితి ఇక్క‌డ ఉంద‌నీ  ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అలాంటి సమాన‌త‌ల‌ను తొలిగించాలంటే.. మార్టిన్ లూథర్ కింగ్ లేదా రోసా పార్కులు అవసరం కావచ్చ‌ని అన్నారు.

కర్నాటక హిజాబ్ వివాదం..

కర్నాటకలో జనవరి 1, 2022న ఉడిపి మహిళా ప్రీ-యూనివర్శిటీ కళాశాలలో హిజాబ్‌లు ధరించి ముస్లిం  విద్యార్థినులు  త‌ర‌గ‌తులోనికి అనుమతించకపోవడంతో హిజాబ్ వివాదం మొదలైంది. అప్పటి నుండి, కర్నాటక అంతటా ముస్లిం బాలికలు హిజాబ్‌లు ధరించి తరగతులకు రావడం,  హిందూ విద్యార్థులు నిరసనకు చిహ్నంగా కాషాయం కండువా ధరించడం ప్రారంభించారు. ఈ త‌రుణంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఉద్రిక‌త్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. పరిస్థితి హింసాత్మకంగా మారడంతో, కర్ణాటక ప్రభుత్వం మూడు రోజుల పాటు పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది.మ‌రో వైపు ఈ సమస్య ప్రస్తుతం క‌ర్ణాట‌క‌ హైకోర్టులో ఉంది. ఎలాంటి తీర్పు వెల్ల‌డిస్తుందో వేచి చూడాలి.

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !