మైనర్ కూతురిపై అత్యాచారం.. మృగాడైన తండ్రికి పదేళ్ల జైలు శిక్ష విధించిన కర్ణాటక కోర్టు..

Published : Feb 28, 2022, 12:58 PM IST
మైనర్ కూతురిపై అత్యాచారం.. మృగాడైన తండ్రికి పదేళ్ల జైలు శిక్ష విధించిన కర్ణాటక కోర్టు..

సారాంశం

కన్నూ, మిన్ను కానక ఓ తండ్రి తన 13యేళ్ల కూతురుమీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు అరెస్ట్ చేసి కేసు పెట్టగా ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. హైకోర్టుకు వెళ్లాడు. అక్కడా అదే తీర్పును సమర్థించడంతో జైల్లో పడ్డాడు. 

బెంగళూరు : తన minor కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు బెంగళూరు వ్యక్తిని దోషిగా నిర్ధారించి, శిక్ష విధించిన 2016 నాటి ట్రయల్ కోర్టు తీర్పును Karnataka HighCourt సమర్థించింది. ప్రాథమిక ఫిర్యాదులో చాలా లోపాలు, వైరుధ్యాలు ఉన్నాయని చెబుతూ అతని అప్పీల్‌ను కొట్టివేసింది. "బాధితురాలి తల్లి మానసిక స్థితి దెబ్బతిన్నది.. ఆ ఘటన తరువాత బాలిక అమ్మమ్మ వెంటనే మరణించింది. కుటుంబం దుర్భర దారిద్ర్యంలో కూరుకుపోయింది. దీనంతటికీ తండ్రే స్వయంగా కారణం. ఇలాంటి పరిస్థితుల్లో ఫిర్యాదు దాఖలు చేయడంలో ఆలస్యం చేయరాదు. వెంటనే ప్రాసిక్యూషన్‌ ప్రారంభించాలి’’ అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కేఎస్‌ ముదగల్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ ఘటనపై చేసిన ఫిర్యాదులో అసలు విషయాలపై నిర్దిష్టత లేదని  న్యాయమూర్తి స్పందిస్తూ "ప్రాథమిక సమాచార నివేదిక అనేది ఎన్‌సైక్లోపీడియా కాదు..." అని ఎత్తి చూపారు. "కాబట్టి, అప్పీలుదారు అసలు ప్రవర్తన గురించి ప్రస్తావించకపోవడం వల్ల ప్రాసిక్యూషన్ కేసును తప్పుపట్టిస్తుందని అన్నారు.. దీనివల్ల అతని మీద ఆరోపించిన విషయాలు నిజం కాకుండా పోవు అన్నారు. ఈ వివాదం ఆమోదయోగ్యం కాదు... అని న్యాయమూర్తి చెప్పుకొచ్చారు.

ఈ సంఘటన సెప్టెంబర్ 27, 2014 రాత్రి జరిగింది. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన అత్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బెంగళూరులోని హెచ్‌ఏఎల్ పోలీసులు నిందితుడైన తండ్రిపై సెప్టెంబర్ 29, 2014న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఘటన జరిగినప్పుడు బాలిక వయస్సు 13 ఏళ్లు. సెప్టెంబర్ 22, 2016న, ట్రయల్ కోర్ట్ IPCలోని సెక్షన్ 376 (రేప్), సెక్షన్ 5(n) కింద శిక్షార్హమైన నేరానికి నిందితుడిని దోషిగా నిర్ధారించింది. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, 2012లోని సెక్షన్ 6తో కింద కేసును పరిశీలించారు. కోర్టు అతనికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 2,000 జరిమానా విధించింది.

2016 నాటి ట్రయల్ కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఈశ్వర్ కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు. ఇంత ఆలస్యం కావడానికి కారణం మేజిస్ట్రేట్ ముందు బాధితురాలు, సాక్షుల వాంగ్మూలంలో వైరుధ్యాలు.. ఒక్కోరోజు ఒక్కోలా చెప్పడం అని..  దర్యాప్తు అధికారి  బాలిక తల్లి, అమ్మమ్మలను విచారించలేదని చెబుతూ ఈశ్వర్ తీర్పుపై అప్పీల్ చేశారు. వారిద్దరూ ఘటన జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్నారని అందులో పేర్కొన్నాడు.

అయితే బాధితురాలు తన తండ్రి గురించి.. ఆయన చేసిన దాని గురించి స్పష్టంగా చెప్పిందని.. ఆమె సాక్ష్యం.. ఆమె అత్త, మామ, డాక్టర్.. మెడికల్ ప్రూఫ్ ల ద్వారా ధృవీకరించబడిందని ప్రాసిక్యూషన్ తెలిపింది. "ఫిర్యాదు దాఖలు చేయడంలో విపరీతమైన జాప్యం జరగలేదని తెలిపింది. అంతేకాదు ఈ తరహా కేసులలో, ఫిర్యాదు దాఖలు చేయడంలో ఆలస్యం వల్ల ప్రాసిక్యూషన్ కేసును నిలిపివేయదు. ఫిర్యాదు దాఖలు చేసిన తొమ్మిదవ రోజున బాధితురాలి తల్లి మరణించింది. బాధితురాలి తల్లి మాట్లాడే స్థితిలో లేదని బాధితురాలి అత్త సాక్ష్యం నిరూపిస్తుంది. కాబట్టి, తల్లి, అమ్మమ్మల స్టేట్‌మెంట్‌లను నమోదు చేయకపోవడం ప్రాసిక్యూషన్‌ తప్పు కాదు ”అని కోర్టుకు తెలిపింది.

(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాధితురాలి గుర్తింపు ఆమె గోప్యతను కాపాడేందుకు బహిర్గతం చేయలేదు)

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌