Hijab row: విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేసిన కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి

Published : Feb 09, 2022, 03:59 PM ISTUpdated : Feb 09, 2022, 04:24 PM IST
Hijab row: విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేసిన  కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి

సారాంశం

హిజాబ్ విషయమై  దాఖలైన పిటిషన్ ను విస్తృత ధర్మాసనానికి ఇవ్వాలని కర్ణాటక సింగిల్ జడ్జి రిఫర్ చేసింది.

బెంగుళూరు: Hijab విషయమై దాఖలైన పిటిషన్ ను విస్తృత ధర్మాసనానికి  Karnataka Single  Judge రిఫర్ చేసింది. అయితే ఈ విషయమై విస్తృత ధర్మాసనం అవసరమని భావిస్తున్నామని జడ్జి క్రిషన్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు. అయితే గతంలో ఇదే తరహాలో  Madras, Keralaహైకోర్టుల్లో తీర్పును సింగిల్ జడ్జి లే ఇచ్చారని న్యాయవాది కాళీశ్వరం రాజ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులను కూడా విస్తృత బెంచే ఇస్తుందని సింగిల్ జడ్జి అభిప్రాయపడ్డారు.

Bangloreలో రెండు వారాల పాటు నిరసనలపై ఆంక్షలు విధించారు. హిజాబ్ పై వరుస పిటిషన్లను తప్పుగా భావించబడుతున్నాయని అడ్వకేట్ జనరల్ ఈ పిటిషన్ పై విచారణ సందర్శంగా  చెప్పారు. అయితే పిల్లలను వారి విశ్వాసాలను అనుసరించి స్కూల్స్ కు వెళ్లనివ్వాలని  పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. అయితే ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయడాన్ని పిటిషనర్ వ్యతిరేకించారు.  ఈ విషయమై వెంటనే పరిష్కారం కావాలని పిటిషనర్ కోరుకొన్నాడు.

మరోవైపు విద్యార్ధులు హిజాబ్ ధరించి కాలేజీలకు వెళ్లేందుకు వీలుగా మధ్యంతర ఉపశమనం మంజూరు చేయడాన్ని అడ్వకేట్ జనరల్ వ్యతిరేకించారు.  ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు పిటిషన్ ను అనుమతించవద్దని అడ్వకేట్ జనరల్ చెప్పారు.ప్రభుత్వ గెజిటెడ్ ఆర్డర్ ను ప్రశ్నించినందున పిటిషనర్ల అభ్యర్ధనలు తప్పుగా భావించబడ్డాయని అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవాదీ చెప్పారు.  ప్రతి సంస్థకు స్వయంప్రతిపత్తి ఇచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు. కాలేజీ లేదా విద్యా సంస్థలు నిర్ధేశించిన డ్రెస్ కోడ్ కు కట్టుబడి పిల్లలు తప్పనిసరిగా స్కూల్ కు హాజరు కావాలని  అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు.

మరోవైపు శివమొగ్గలో 144 సెక్షన్ ను విధించారు. హిజాబ్ వివాదం నేపథ్యంలో రాష్ట్రంలో విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవులను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.గ‌త‌నెల‌లోUdupiలోని ప్రభుత్వ college లో ఈ వివాదం ప్రారంభ‌మైంది. ఆరుగురు విద్యార్థినీలు నిర్దేశించిన దుస్తుల కోడ్‌ను ఉల్లంఘించి Hijabలు ధరించి తరగతులకు వచ్చారు. తర్వాత నగరంలోని మరికొన్ని కళాశాలల్లో సమీపంలోని కుందాపూర్, బిందూర్‌లలో కూడా ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. ఈ ఆంశానికి వ్య‌తిరేకంగా ఓ వర్గం విద్యార్థులు కాషాయ కండువాలు ధ‌రించి క‌ళాశాల‌కు ప్ర‌వేశించారు. తాము కండువా ధరించి వ‌స్తామ‌నీ తెలిపారు. కానీ వ్య‌తిరేకించ‌డంతో  తమను తరగతుల నుండి నిషేధించారని ఆరోపించడంతో  నిరసనలు ప్రారంభించారు. ఉడిపి, చిక్ మంగళూరులోని రైట్‌వింగ్ గ్రూపులు ముస్లిం బాలికలు హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకించాయి. ఈ నిరసనలు ఉడిపిలో ఉన్న మరిన్ని కళాశాలలకు వ్యాపించాయి.

ఈ క్ర‌మంలో  ఫిబ్రవరి 8  ఉడిపిలోని ఒక ప్రభుత్వ కళాశాలలో ఇన్‌స్టిట్యూట్‌లో హిజాబ్‌ను నిషేధించిన ఉత్తర్వులను సవాలు చేస్తూ High Courtలో  పిటిష‌న్ దాఖాలు చేశారు. ఈ పిటిషన్‌లను కర్ణాటక హైకోర్టు విచారించనుంది. స్కూల్ అడ్మినిస్ట్రేషన్ డిక్రీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ను ఉల్లంఘించడమేనని దాని ప్రకారం మత స్వేచ్ఛ ఉందని విద్యార్థి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. హిజాబ్ వివాదం  కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తోంది. హైద్రాబాద్ లో కూడా కొందరు విద్యార్ధులు హిజాబ్ కు మద్దతుగా బుధవారం నాడు ర్యాలీలు చేశారు. 


 


 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu