బైక్‌పై ట్రిపుల్ రైడింగ్‌కు అనుమతిస్తాం.. అవసరమైతే.. ట్రైన్లు, జీపులకు చలాన్లు వేస్తాం: ఎస్‌బీఎస్‌పీ చీఫ్

Published : Feb 09, 2022, 03:20 PM IST
బైక్‌పై ట్రిపుల్ రైడింగ్‌కు అనుమతిస్తాం.. అవసరమైతే.. ట్రైన్లు, జీపులకు చలాన్లు వేస్తాం: ఎస్‌బీఎస్‌పీ చీఫ్

సారాంశం

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అఖిలేశ్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్న సుహెల్దెవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాశ్ రాజ్‌భర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే బైక్‌‌పై ట్రిపుల్ రైడింగ్‌కు అనుమతులు ఇస్తామని ఓ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ట్రైన్లు, జీపుల్లో ఉన్న సీట్లకు మించి ఎందుకు ప్రయాణికులను అనుమతిస్తారని ప్రశ్నించారు.  

లక్నో: ఎన్నికల ప్రచారాల్లో వినూత్న హామీలు వింటూ ఉంటాం. కొన్ని ఎప్పుడూ వినిపించే హామీలే ఉంటాయి. ఉదాహరణకు రుణ మాఫీల వంటివి. కాగా, ప్రతి ఎన్నికలకు కొత్తగా వచ్చే హామీలూ ఉంటాయి. ఇలాంటి కొత్త హామీలే ఉత్తరప్రదేశ్‌లో వినిపించాయి. అఖిలేశ్ యాదవ్ సారథ్యంతోని సమాజ్‌వాదీ పార్టీతో జట్టు కట్టిన సుహెల్దెవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాశ్ రాజ్‌భర్(Om Prakash Rajbhar) సంచలన హామీలు ఇచ్చారు. 70 సీట్లతో నడిచే ట్రైన్‌ (Train)లో 300 మంది ప్రయాణించడానికైనా అనుమతిస్తారని, కానీ, ఒక బైక్‌(Bike)పై ముగ్గురిని(Triple Riding) ఎందుకు ప్రయాణించడానికి అనుమతించరని ప్రశ్నించారు.

‘ఒక ట్రైన్ 70 సీట్లపై 300 మంది ప్రయాణికులను మోసుకెళ్తుంది. అలాంటప్పుడు ఒక బైక్‌పై ముగ్గురు వెళ్తే సమస్య ఏంటి?’ అని ఓం ప్రకాశ్ రాజ్‌భర ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బైక్‌పై ట్రిపుల్ రైడింగ్‌కు అనుమతి ఇస్తామని వివరించారు. లేదంటే సీట్ల కన్నా ఎక్కువ మందిని తీసుకెళ్లే.. ట్రైన్లు, జీపులకూ చలాన్లు వేస్తామని పేర్కొన్నారు. ఓం ప్రకాశ్ రాజ్‌భర్ ఘాజీపూర్ జిల్లాలోని జహూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మార్చి 7వ తేదీన ఘాజీపూర్‌లో ఎన్నికలు జరుగుతాయి.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్యే ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్నది. ఈ పార్టీపై సమాజ్‌వాదీ పార్టీ బలంగా పోరాడుతున్నది. అఖిలేశ్ యాదవ్ ప్రతిపక్ష శిబిరంలోని ఇతర నేతలనూ సత్సంబంధాలు ఉన్నాయి. కేసీఆర్, మమతా బెనర్జీల నుంచీ ఆయనకు మద్దతు ఉన్నది. ఈ మద్దతు ఓట్లు కురిపిస్తాయా? అనేది తేలాల్సి ఉన్నది. అదీగాక, అఖిలేశ్ యాదవ్ స్థానికంగా ఉన్న చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. యూపీలో ప్రధానంగా ముస్లింలు, యాదవ్‌లు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అలాగే, రాష్ట్రంలోని పలు చోట్ల రాజ్‌భర్ ప్రాబల్యమూ బలంగా ఉన్నది. ఈ రాజ్‌భర్‌ల మద్దతు ఉన్నదే సుహెల్దెవ్ భారతీయ సమాజ్ పార్టీ. ఈ పార్టీ చీఫ్ ఓం ప్రకాశ్ రాజ్‌భర్. ఆయనకు రాజ్‌భర్ కమ్యూనిటీలో మంచి ఆదరణ ఉన్నది.

ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్‌లో తొలి దశ పోలింగ్‌కు ఒక రోజు ఉండ‌గా కాంగ్రెస్ త‌న మేనిఫెస్టో విడుద‌ల చేసింది. ‘ఉన్న‌తి విధాన్ పేరుతో రూపొందిన ఈ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ ల‌క్నోలో బుధ‌వారం ఆవిష్క‌రించారు. ఈ మేనిఫెస్టో ప్ర‌ధానంగా మహిళలు, రైతులు, చిన్న వ్యాపారుల సాధికారత, అభ్యున్నతిపై దృష్టి సారించింది. ఈ మేనిఫెస్టోను విడుదల చేస్తూ ప్రియాంక గాంధీ మాట్లాడారు. “ఉత్తరప్రదేశ్ ప్రజలు తమ అభివృద్ధి, సంక్షేమాన్ని ఎజెండాగా భావించే పార్టీని ఎన్నుకుంటార‌ని కాంగ్రెస్ విశ్వ‌సిస్తోంది. అలాంటి రాజకీయ వ్యవస్థ రాష్ట్ర ప్రజలకు అవసరం. అది ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకురావచ్చు. యూపీ కాంగ్రెస్‌కు చెందిన ఉన్నతి విధాన్ దీనికి మార్గాన్ని సిద్ధం చేస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 10 రోజుల్లో రైతుల రుణమాఫీ అమలు చేస్తామని మేనిఫెస్టో తెలిపింది. విద్యుత్ బిల్లులు సగానికి తగ్గిస్తామని, అలాగే కోవిడ్ (covid) కాలానికి సంబంధించిన బకాయిలు మాఫీ చేస్తామని చెప్పింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !