భారతీయ జనతా పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరు ఇటీవల రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు . ఎంపీలు దియా కుమారి, బాబా బాలక్‌నాథ్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లోక్‌సభలకు, కిరోరి లాల్ మీనా రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు.
భారతీయ జనతా పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరు ఇటీవల రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు . ఎంపీలు దియా కుమారి, బాబా బాలక్‌నాథ్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లోక్‌సభలకు, కిరోరి లాల్ మీనా రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. వీరిలో కనీసం ముగ్గురు సీఎం, డిప్యూటీ సీఎం రేసులో ఉన్నారని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీరితో పాటు మధ్యప్రదేశ్ , ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు కూడా రాజీనామా చేశారు.
ఇటీవల ముగిసిన రాజస్థాన్ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన నలుగురు రాజస్థాన్ ఎంపీలు లోక్‌సభకు రాజీనామా చేశారు. … pic.twitter.com/ZVxul6Moje
— Asianetnews Telugu (@AsianetNewsTL)
రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి, రాజస్థాన్ ఇన్‌ఛార్జ్ అరుణ్ సింగ్‌లకు సీఎం పేరు ఖరారు చేసే బాధ్యతలను అధిష్టానం అప్పగించడంతో నేతలిద్దరూ జైపూర్ చేరుకున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకునేందుకు గాను వీరిద్దరూ ఒక్కొక్కరిని కలుస్తున్నారు. ఈ నేతలకు సీఎం పదవి కోసం ఎమ్మెల్యేలంతా 10 మందికి పైగా పేర్లు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే సీఎం రేసులో వసుంధర రాజే సింధియా, బాబా బాల్కనాథ్, దియా కుమారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సీఎం కోసం ముగ్గురి పేర్లతో ప్యానెల్‌ను ఏర్పాటు చేసినట్లు కూడా చర్చ జరుగుతోంది. ఈ ముగ్గురిలో ఒక్కరు మాత్రమే సీఎం కాగలరు.
మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీలు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, రాకేష్ సింగ్, ఉదయ్ ప్రతాప్, రీతీ పాఠక్ .. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అరుణ్ సావో, గోమతి సాయి కూడా తమ పార్లమెంట్ సభ్యత్వాలకు రాజీనామా చేసిన వారిలో వున్నారు.
ఇకపోతే.. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ బీజేపీ మొత్తం 115 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ పార్టీ 69 స్థానాలకు పడిపోయింది. బహుజన్ సమాజ్ పార్టీకి 2 సీట్లు వచ్చాయి. 199 సీట్లున్న రాజస్థాన్ అసెంబ్లీలో మెజారిటీ సంఖ్య 101 కాగా, బీజేపీ దీని కంటే 14 సీట్లు ఎక్కువగా గెలుచుకుంది. రాజస్థాన్‌లో బిజెపి చాలా మంది ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయించింది. వారిలో నలుగురు ఎంపీలు ఎన్నికల్లో విజయం సాధించగా.. ఇప్పుడు వీరిలో ఒకరికి రాజస్థాన్ ప్రభుత్వ పగ్గాలు అందే అవకాశం వుంది.