కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. 42 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించిన కాంగ్రెస్..

Published : Apr 06, 2023, 11:54 AM IST
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. 42 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించిన కాంగ్రెస్..

సారాంశం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ ఈరోజు ప్రకటించింది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ ఈరోజు ప్రకటించింది. త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ సీఈసీ ఖరారు చేసినట్టుగా ఆ పార్టీ పేర్కొంది. రెండో జాబితాలో కొందరు ముఖ్యమైన నేతలు పోటి చేసే స్థానాలను పరిశీలిస్తే.. గోకాక్ నుంచి మహంతేష్ కడాడి, అఫజల్‌పూర్ నుంచి ఎంవై పాటిల్, కలఘటగి నుంచి సంతోష్ లాడ్‌లు బరిలో నిలవనున్నారు. 

ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 124 మంది అభ్యర్థుల‌తో తొలి  జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు 42 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించింది. దీంతో కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉండగా..  అందులో 166 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్టుగా అయింది. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 

 


ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలోనే పలువురు ముఖ్య నాయకులు పోటీ చేసే స్థానాలపై క్లారిటీ  ఇచ్చిన సంగతి తెలిసిందే. వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం సిద్దరామయ్య, కనకపుర అసెంబ్లీ  నియోజకవర్గం నుంచి పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ పోటీ  చేస్తారని తెలిపింది. కొరటగెరె (ఎస్సీ) నియోజకవర్గం నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వరను పార్టీ బరిలోకి దింపింది. మాజీ మంత్రులు కేహెచ్ మునియప్ప- దేవనహళ్లి, ప్రియాంక్ ఖర్గే-చితాపూర్ (ఎస్సీ) నుంచి పోటీ చేయనున్నారు. ప్రియాంక్ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుమారుడు అన్న సంగతి తెలిసిందే.

కర్ణాటకలో అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉండగా.. ప్రస్తుత అధికార బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే మరోసారి అధికారం నిలుపుకోవాలని  బీజేపీ భావిస్తుండగా.. కాంగ్రెస్ తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చూస్తుంది. 

ఇక, కర్ణాకటలో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 13న వెలువడనుంది. మే 10న పోలింగ్ జరుగనుంది. ఓట్ల లెక్కింపు మే 13న చేపట్టనున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్