Karnataka Election Results: తిరుగులేని విజ‌యం దిశ‌గా కాంగ్రెస్.. 'మై టీం' అంటూ డీకే శివ‌కుమార్ ఫొటో వైర‌ల్

Published : May 13, 2023, 01:21 PM IST
Karnataka Election Results: తిరుగులేని విజ‌యం దిశ‌గా కాంగ్రెస్.. 'మై టీం' అంటూ డీకే శివ‌కుమార్ ఫొటో వైర‌ల్

సారాంశం

Karnataka Election Results: ఏడాది క్రితం మొదలైన పక్కా వ్యూహాలు, ప్రచారంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ముందుకు సాగిన కాంగ్రెస్.. ఇప్ప‌టివ‌ర‌కు కొన‌సాగుతున్న ఎల‌క్ష‌న్స్ ట్రెండ్స్ అధికారం అప్ప‌గించే దిశ‌గా ఉన్నాయి. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 129 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ తన బృందంతో కలిసి ఎన్నికల ఫలితాలను వీక్షిస్తున్న ఫొటోను ట్వీట్ చేశారు.

Karnataka Congress president DK Shivakumar: 2024 లో ముఖ్యమైన లోక్ స‌భ‌ ఎన్నికలు, రాజస్థాన్, ఛత్తీస్ గ‌ఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ వంటి తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ బూస్టును ఇస్తున్నాయి. తిరుగులేని విధంగా కాంగ్రెస్ అధికార పీఠం ద‌క్కించుకునేలా అధిక్యంలో ముందుకు సాగుతోంది. మధ్యాహ్నం 12.25 గంటల సమయానికి 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ఆ పార్టీ 129 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. భారతీయ జనతా పార్టీ 69, జనతాదళ్ (సెక్యులర్) 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

ఈ క్ర‌మంలోనే సీఎం పదవికి ప్రత్యర్థిగా ఉన్న కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ తన బృందంతో కలిసి ఎన్నికల ఫలితాలను వీక్షిస్తున్న ఫొటోను ట్వీట్ చేశారు. మై టీమ్ అంటూ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఈ ఫొటో వైర‌ల్ గా మారింది. 

 

 

ఇదిలావుండగా, కర్ణాటక ఫలితాలు ఖచ్చితమైనవి కావడంతో కాంగ్రెస్ గెలిచిందనీ, ప్రధాని ఓడిపోయారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్వీట్ చేశారు. 'బీజేపీ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రధానిపై రెఫరెండంగా, రాష్ట్రానికి ఆయన ఆశీర్వాదం పొందడంపై రెఫరెండంగా మార్చుకుంది. దాన్ని నిర్ణయాత్మకంగా తిరస్కరించారు అని' అని పేర్కొన్నారు. 'ప్రధాని పోలరైజేషన్ కు ప్రయత్నించారు, విభజనకు ప్రయత్నించారు. బెంగళూరులో సామాజిక శాంతి, ఆర్థిక శ్రేయస్సును మిళితం చేసే శక్తిని కర్ణాటకలో ఓటర్లు ఎన్నుకుంటున్నారని' రమేశ్ పేర్కొన్నారు.

'40% కమీషన్ ప్రభుత్వం' అనే పార్టీ నినాదాన్ని కర్ణాటక ప్రజలు అంగీకరించారని మరో సీనియర్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ శనివారం అన్నారు.  ఈ అంగీకారం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కీలక మలుపుగా నిలిచిందని, దీంతో  కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసిందని ఆయన అన్నారు. జీవనోపాధి, ఆహార భద్రత, ధరల పెరుగుదల, రైతుల కష్టాలు, విద్యుత్ సరఫరా, నిరుద్యోగం, అవినీతి వంటి స్థానిక సమస్యలపై కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పోరాడింది. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వంటి కేంద్ర నేతలు పార్టీ ప్ర‌చారంలో పాల్గొన్నారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

2026 Sankranthi celebrations in Delhi | PM Modi Powerful Pongal Speech | Asianet News Telugu
Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu