Karnataka Elections: ఊపందకున్న 'కర్నాటక' ప్రచారం.. స్టార్ క్యాంపైనర్స్ జాబితాలో తెలంగాణ బీజేపీ నేత..

Published : Apr 19, 2023, 02:12 PM IST
Karnataka Elections: ఊపందకున్న 'కర్నాటక' ప్రచారం.. స్టార్ క్యాంపైనర్స్ జాబితాలో తెలంగాణ బీజేపీ నేత..

సారాంశం

Karnataka Elections: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అదే సమయంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధికార బీజేపీ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. 

Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలోను హడావిడి కనిపిస్తోంది. కన్నడనాట ప్రచారం చేయడానికి  తెలంగాణ బీజేపీ నేతలు సిద్దమయ్యారు. తాజాగా బీజేపీ అధిష్టానం.. కర్ణాటక ఎన్నికల ప్రచారం కోసం 40 మందితో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. ఈ లిస్టులో తెలంగాణ బీజేపీ నాయకురాలు డీకే అరుణ పేరు కూడా ఉంది. దీంతో  ప్రచారానికి తెలంగాణ బీజేపీ నేతలు, కార్యకర్తలు తరలి వెళ్లనున్నారు.

స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సహా 40 మంది పేర్లు ఉన్నాయి. ఏప్రిల్ 26, 30 తేదీల్లో కాకుండా మే 6న కర్ణాటకలో ర్యాలీకి సీఎం యోగి ఆదిత్యనాథ్ సిద్ధమవుతున్నారు.   

బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు వీరే

1. ప్రధాని నరేంద్ర మోదీ
2. జగత్ ప్రకాష్ నడ్డా
3. రాజ్‌నాథ్ సింగ్
4. అమిత్ షా
5. నితిన్ గడ్కరీ
6. BS యడ్యూరప్ప
7. నళిన్ కుమార్ కటీల్
8. బసవరాజ్ బొమ్మై
9. ప్రహ్లాద్ జోషి
10. డివి సదానంద గౌడ
11. కేఎస్ ఈశ్వరప్ప
12. ఎం గోవింద్ కర్జోల్
13. ఆర్ అశోక్
14. నిర్మలా సీతారామన్
15. స్మృతి ఇరానీ
16. ధర్మేంద్ర ప్రధాన్
17. మన్సుఖ్ భాయ్ మాండవియా
18. కె అన్నామలై
19. అరుణ్ సింగ్
20. డీకే అరుణ
21. సి.టి.రవి
22. యోగి ఆదిత్యనాథ్
23. శివరాజ్ సింగ్ చౌహాన్
24. హేమంత బిస్వా శర్మ
25. దేవేంద్ర ఫడ్నవిస్
26. ప్రభాకర్ కోర్
27. శోభా కరంద్లాజ
28. ఎ నారాయణస్వామి
29. భగవంత్ ఖుబా
30. అరవింద్ లింబవల్లి
31. బి శ్రీరాములు
32. కోట శ్రీనివాస పూజారి
33. బసనగౌడ పాటిల్ యత్నాల్
34. ఉమేష్ జాదవ్
35. చలవాడి నారాయణస్వామి
36. ఎన్ రవికుమార్ =
37. జివి రాజేష్
38. జగ్గేష్
39. శృతి
40. తారా అనురాధ

 
కర్ణాటకలో మరోసారి అధికారం సాధించే లక్ష్యంగా బీజేపీ పక్కా ప్రణాళికలను సిద్దం చేసింది. ఈ క్రమంలో కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు, వివేక్, జితేందర్ రెడ్డి, గరికపాటి, ఇంద్రసేనారెడ్డి, ఎస్.కుమార్ లకు ప్రచార బాధ్యతలను అప్పగించింది BJP అధిష్టానం.

కర్ణాటకలో తెలుగువారు ఉన్న ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించటానికి నియమించినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలను పరిశీలిస్తే.. దక్షిణాదిలో కర్ణాటకతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పై  బీజేపీ ప్రత్యేక దృష్టి సారించినట్టు అనిపిస్తోంది. కర్ణాటకలో బీజేపీ విజయం సాధిస్తే.. తెలంగాణలో బీజేపీ దూకుడు పెరుగుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu