డిప్యూటీ సీఎం షూ తుడిచిన గన్‌మెన్.. న్యూస్ చేయొద్దన్న ఉపముఖ్యమంత్రి

By sivanagaprasad KodatiFirst Published 6, Sep 2018, 11:41 AM IST
Highlights

గన్‌మెన్‌తో ఉప ముఖ్యమంత్రి షూ తుడిపించిన ఘటన కర్ణాటకలో వైరల్ అవుతోంది. బెంగళూరులోని శివాజీ నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పరిశీలనకు అధికారులు, ఎమ్మెల్యేలతో కలిసి ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర వెళ్లారు.

గన్‌మెన్‌తో ఉప ముఖ్యమంత్రి షూ తుడిపించిన ఘటన కర్ణాటకలో వైరల్ అవుతోంది. బెంగళూరులోని శివాజీ నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పరిశీలనకు అధికారులు, ఎమ్మెల్యేలతో కలిసి ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర వెళ్లారు. కారు దిగి అడుగు కింద పెట్టగానే కాలుకి, కుర్తాకి బురద అంటింది.

దీనిని గమనించిన పరమేశ్వర గన్‌మెన్ వెంటనే తన కర్చీఫ్‌తో కింద కూర్చొని కాలుకి అంటిని మట్టిని శుభ్రం చేయడమే కాకుండా.. షూని తుడిచాడు. చుట్టూ ప్రజాప్రతినిధులు, అధికారులు, జనం ఉన్నప్పటికీ.. ఉపముఖ్యమంత్రి తన గన్‌మెన్‌ను వారించకపోవడంతో అక్కడున్న వారు ముక్కున వేలేసుకున్నారు.

దీనిపై మీడియా వివరణ కోరగా.. ఇదేదో ఇంటర్నేషనల్ న్యూస్‌లాగా హైలెట్ చేయకండి అంటూ సమాధానాన్ని దాట వేశారు. అయితే దీనికి సంబంధించిన వీడియో  సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కర్ణాకటలో అధికార, ప్రతిపపక్షాలు వాగ్వివాదానికి దిగాయి. 
 

Last Updated 9, Sep 2018, 12:27 PM IST